Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాలను లైనప్‌లో పెట్టిన ప్రభాస్, ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న తృప్తి డిమ్రి తాజాగా షూటింగ్లో చేరారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరించినట్లు సమాచారం. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని అప్డేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని కోటి ఉమెన్స్ కాలేజీ ప్రాంతానికి మార్చనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రభాస్, తృప్తి డిమ్రి మధ్య మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ కథలో ప్రభాస్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కనిపించే ఎమోషన్, యాక్షన్, పాత్రల తీవ్రత ఈ చిత్రంలో కూడా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించనున్నట్లు సమాచారం. హీరో-విలన్ మధ్య పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కొత్త లుక్, పోలీస్ పాత్ర, సందీప్ రెడ్డి వంగా స్టైల్ మేకింగ్ కలిసివస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.