Jemimah Rodrigues | వరల్డ్‌కప్ స్టార్‌కు గాయం.. ఆసియా కప్ ఆడేనా..?
Jemimah Rodrigues : భారత క్రికెట్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. పురుషుల జట్టులోని కీలక ఆటగాళ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో ఉండగా.. మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues ) సైతం అనూహ్యంగా గాయపడింది.
Jemimah Rodrigues : భారత క్రికెట్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. పురుషుల జట్టులోని కీలక ఆటగాళ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో ఉండగా.. మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues ) సైతం అనూహ్యంగా గాయపడింది. ఇంగ్లండ్‌లో ‘ది హండ్రెడ్ లీగ్’ ఆడుతున్న జెమీమా తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో.. ఆగస్టు నెలాఖరులోనే జరుగనున్న ఆసియా కప్‌లో ఈ వరల్డ్‌కప్ స్టార్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
మహిళల ఆసియా కప్ సమీపిస్తున్న వేళ భారత జట్టుకు బిగ్ షాక్. స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో మెరిసిన జెమీమా రోడ్రిగ్స్ తీవ్రంగా గాయపడింది. ది హండ్రెడ్ లీగ్‌లో సథర్న్ బ్రేవ్(Southern Brav) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Jemimah Rodrigues will miss the rest of Southern Brave’s campaign in the Hundred pic.twitter.com/bdrKDt5SKx
— Cricinfo (@cricinfo) August 8, 2026
అయితే.. త్వరలోనే యూఏఈ వేదికగా ఆసియా కప్ షురూ కానుంది. ఆలోపు జెమీమా కోలుకుంటుందా? లేదా? అని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఆసియా క్రికెట్ మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28 నుంచి ఆసియా కప్ మొదలవ్వనుంది. అందరూ ఆసక్తి కనబరిచే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరుగనుంది.
76 లక్షలకు
మిడిలార్డర్లో ఇన్నింగ్స్ నిర్మించే జెమీమాను సథర్న్ బ్రేవ్ జట్టు ఏకంగా రూ.76 లక్షలకు కొన్నది. అంచనాలకు తగ్గట్టే ది హండ్రెడ్ లీగ్‌లో నిలకడగా రాణించిన తను.. ఆరు మ్యాచుల్లో 143 పరుగులతో ఆకట్టుకుంది. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తను.. సథర్న్ బ్రేవ్ జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగడంలో కీలకమైంది. కానీ, నాకౌట్ దశకు ముందే గాయం కారణంగా జెమీమా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను తీసుకుంది ఫ్రాంచైజీ.
The extent of Rodrigues’ hamstring injury has yet to be ascertained https://t.co/1FmR0MIYj8
— Cricinfo (@cricinfo) August 8, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

