Sports | క్రీడల్లో గెలుపోటములు సహజం : జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్
Sports | క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రయత్నిస్తే సాధించలేనిది ఉండదని ఆర్యవైశ్య సత్రం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేష్‌బాబు అన్నారు.
హనుమకొండ చౌరస్తా : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రయత్నిస్తే సాధించ లేనిది ఉండదని ఆర్యవైశ్య సత్రం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేష్‌బాబు ( Gattu Mahesh Babu ) అన్నారు. హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ( State Level Athlets ) ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గట్టు మహేష్‌బాబు, గట్టు అరవింద్ విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. అనంతరం గట్టు మహేష్‌బాబు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఓరుగల్లు ఖిల్లా పుట్టినిల్లు లాంటిదని, పోరాటాలగడ్డ ఓరుగల్లు నుంచి ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి అథ్లెట్లు విశ్వవేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించారన్నారు.

క్రీడల్లో క్రమశిక్షణ, కఠోర సాధన చేసినప్పుడు అనుకున్న లక్ష్యంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు నాగరాజు, శ్రీమన్నారాయణ, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

