Watch: దాహంతో అల్లాడిన కోతి బస్సును ఆపింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Thirsty Monkey Stops Bus | మండే ఎండలకు ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. తాగు నీరు కోసం ఏకంగా ఒక బస్సును ఆపింది. దాని దీన పరిస్థితికి ప్రయాణికులు చలించిపోయారు. తమ బాటిల్లోని నీటిని ఆ కోతికి తాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: మండే ఎండలకు ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. తాగు నీరు కోసం ఏకంగా ఒక బస్సును ఆపింది. దాని దీన పరిస్థితికి ప్రయాణికులు చలించిపోయారు. తమ బాటిల్లోని నీటిని ఆ కోతికి తాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Thirsty Monkey Stops Bus) మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ ఆర్టీసీ) బస్సు అటవీ ప్రాంతమైన ఖండాలా ఘాట్ వద్దకు చేరుకున్నది.
కాగా, ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తుకు వచ్చింది. సరిగ్గా బస్సు ముందు నిల్చొన్నది. గమనించిన డ్రైవర్ ఆ బస్సును ఆపాడు. డ్రైవర్, ప్రయాణికులు ఆ కోతిని రోడ్డు పక్కకు తరిమేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కోతి అక్కడి నుంచి కదలలేదు.
మరోవైపు తీవ్ర ఎండ వేడిమి వల్ల ఆ కోతి ఇబ్బంది పడుతున్నట్లు కొందరు వ్యక్తులు గ్రహించారు. అది దాహంతో అల్లాడిపోతున్నట్లు భావించారు. ఒక వ్యక్తి బాటిల్లోని నీటిని అందించగా ఆ కోతి తాగింది.
అయితే క్షణాల్లోనే మరి కొన్ని కోతలు కూడా అక్కడకు వచ్చాయి. ఆ బస్సును చుట్టుముట్టాయి. దీంతో కొందరు ప్రయాణికులు వాటర్ బాటిల్స్ ద్వారా నీటిని అందించారు. తాగు నీటి కోసం ఆ కోతులు విలవిలలాడటాన్ని బస్సులోని వారు గమనించి భావోద్వేగం చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पुसद के खंडाला घाट में प्यासे बंदरों ने रोका रास्ता, देखें भावुक वीडियो! #MaharashtraHeatwave #ViralVideo #KhandalaGhat #PusadNews #MSRTC #Monkeyvideo #PeoplesUpdate pic.twitter.com/ketUnTLnIU
— People’s Update (@PeoplesUpdate) May 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

