అజిత్ రేసింగ్ జర్నీపై డాక్యుమెంటరీ
తమిళ అగ్ర హీరో అజిత్‌కు మోటార్‌స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ రేస్‌కార్ డ్రైవర్ అయిన అజిత్ ఇప్పటికే పలు అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేసింగ్ జర్నీని ఆవిష్కరిస్తూ ‘గ్లాడియేటర్స్' పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ త్వరలో థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తమిళ అగ్ర హీరో అజిత్‌కు మోటార్‌స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ రేస్‌కార్ డ్రైవర్ అయిన అజిత్ ఇప్పటికే పలు అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేసింగ్ జర్నీని ఆవిష్కరిస్తూ ‘గ్లాడియేటర్స్’ పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ త్వరలో థియేట్రికల్ రిలీజ్ కానుంది. బుధవారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో అజిత్ సతీమణి షాలిని ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.
మోటార్‌స్పోర్ట్స్ ప్రయాణంలో అజిత్ ఎదుర్కొన్న సవాళ్లు, పట్టుదలతో లక్ష్యాలను ఛేదించిన సంఘటనలను ఈ డాక్యుమెంటరీలో చూపించామని, అజిత్ జీవితం తాలూకు మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ స్ఫూర్తివంతంగా ఉంటుందని దర్శకుడు ఏ.ఎల్.విజయ్ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్నందించారు. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘డేర్‌డెవిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

