Dhandha Web Series | అసలైన జెన్‌జీ సిరీస్ ఇది!
Aditya Devulapalli | సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందించిన షార్ట్సిరీస్ ‘దందా’తో గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు ఆదిత్య దేవులపల్లి. చాయ్షాట్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి సిరీస్ తాలూకు విశేషాలను పంచుకున్నారు.
Dhandha | సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందించిన షార్ట్సిరీస్ ‘దందా’తో గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు ఆదిత్య దేవులపల్లి. చాయ్షాట్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి సిరీస్ తాలూకు విశేషాలను పంచుకున్నారు. సినిమాల మీద వ్యామోహంతో ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసి దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం జర్నలిస్ట్‌గా పనిచేసిన అనంతరం సినిమాలపై దృష్టి పెట్టానని చెప్పారు. “దందా’ సిరీస్‌లో సైబర్‌క్రైమ్స్ వెనకున్న దారుణాలను చూపించాం. చిన్న ఓటీపీతోనే మన అకౌంట్ నుంచి లక్షలు మాయమైపోతున్నాయి. నిందితులను మనం పట్టుకోలేకపోతున్నాం.
వినోదప్రధానంగా కథ చెబుతూనే సైబర్ నేరగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టి ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రయత్నించాం’ అని ఆదిత్య దేవులపల్లి అన్నారు. ఇది అసలైన జెన్‌జీ మాస్ సిరీస్ అని, ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుందని, మైక్రో డ్రామానే అయినా.. అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా రోజులు గుర్తుండిపోతుందని అన్నారు. ఈ సిరీస్‌పై ఇప్పటివరకు ఒక్క నెగెటివ్ రివ్యూ రాలేదని, చూసినవారందరూ ఇన్నోవేటివ్ కంటెంట్ అని ప్రశంసిస్తున్నారని, వర్టికల్ స్టోరీటెల్లింగ్‌లో ఇదొక ట్రెండ్ క్రియేట్ చేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఓ యాభైఏళ్ల వయసున్న నేరస్థుడి నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నానని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని ఆదిత్య దేవులపల్లి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

