హైదరాబాద్ : తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్,లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా ముత్స్యాలో అత్యధికంగా 12.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. అకాలక వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది.