సాధారణంగా ఎండ నుంచి రక్షణ కోసమో.. స్టయిల్ కోసమో కళ్లద్దాలు వాడుతుంటాం. కానీ, అవే కళ్లద్దాలతో ఫోన్ మాట్లాడొచ్చని, పాటలు వినొచ్చని ఎప్పుడైనా ఊహించారా? టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఈ వింతలూ సాధ్యం అవుతున్నాయి. అలాంటి ఓ వింతే ఈ Fire-Boltt Fire-Lens Dune స్మార్ట్ గ్లాసెస్. ఇవి చూడటానికి చాలా స్టయిలిష్‌గా ఉన్నా, లోపల చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో ఓపెన్-ఇయర్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. అంటే చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకోకుండానే మీరు పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇది చాలా సురక్షితం. ఈ గ్లాసెస్‌కు ఉన్న పక్క భాగాలను జస్ట్ అలా టచ్ చేస్తే చాలు.. పాటలు మార్చడం, కాల్స్ లిఫ్ట్ చేయడం వంటివి చేసేయొచ్చు. అంతేకాదు, దీనికి అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది. జస్ట్ చెబితే చాలు.. మెసేజ్‌లు పంపడం, మ్యాప్స్ చూడటం వంటివి ఇట్టే చేసేస్తుంది. బ్యాటరీని 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు, 4 గంటల పాటు వాడుకోవచ్చు. ఒకవేళ సైట్ ఉంటే, డాక్టరు సలహాతో ఇందులో ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను కూడా అమర్చుకోవచ్చు.
ధర: రూ. 1,999 (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్

పాయసం, స్వీట్లు తయారు చేసినా.. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను సన్నగా కట్ చేయడం పెద్ద టాస్క్. చాక్లెట్లను తురమాలన్నా, బటర్ని స్లయిసెస్గా కోయాలన్నా చాలా సమయం పడుతుంది. ఈ చిక్కులన్నీ తొలగించి మీ వంట పనిని సులభతరం చేసేందుకు Solitude 3-ఇన్-1 డ్రై ఫ్రూట్ కట్టర్ వచ్చేసింది. ఇది చూడటానికి చిన్న జార్లా ఉన్నా, ఇందులో ఉండే పదునైన స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు డ్రై ఫ్రూట్స్‌ను చాలా వేగంగా కట్ చేస్తాయి. మీరు డ్రై ఫ్రూట్స్‌ను లోపల వేసి తిప్పితే చాలు.. ఐస్‌క్రీమ్ లేదా స్వీట్లపైన చల్లుకోవడానికి వీలుగా సన్నటి ముక్కలు (Slices) వస్తాయి. ఇంకాస్త గట్టిగా వాడితే వీటిని పొడిలా కూడా మార్చుకోవచ్చు. వంట పూర్తయ్యాక దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. స్వీట్లు, సలాడ్లు లేదా బేకింగ్ ఐటమ్స్ చేసేవారికి ఇది ఓ చక్కని కిచెన్ గ్యాడ్జెట్. డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాదు.. చాక్లెట్లు, బటర్ కూడా మనకు నచ్చినట్లుగా కోసుకోవడానికి ఇది భలేగా పనిచేస్తుంది.
ధర: రూ. 999 (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్

వయసు పైబడినవారు, చేతులు వణికే సమస్య ఉన్నవారు టాబ్లెట్లను ప్యాకెట్ (బ్లిస్టర్ ప్యాక్) నుంచి తీయడం కొంచెం కష్టమే. కొన్నిసార్లు తీసే హడావుడిలో టాబ్లెట్లు కింద పడిపోతాయి. అప్పుడప్పుడూ విరిగిపోతుంటాయి కూడా. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ట్యాబ్లెట్లు తీసుకోవడం సులభతరం చేసేందుకు Portable Pill Taker వచ్చేసింది. ఇదో చిన్న పరికరంలా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా టాబ్లెట్ ప్యాకెట్‌ను ఇందులో పెట్టి ఒక్కసారి నొక్కడమే. దీంతో ఆ టాబ్లెట్ ఏమాత్రం దెబ్బతినకుండా నేరుగా కింద ఉన్న బుజ్జి బాక్సులో పడిపోతుంది. మందు బిళ్లలను ప్యాకెట్ నుంచి తీయడానికి గోళ్లతో కష్టపడాల్సిన పని ఉండదిక. ముఖ్యంగా ఆర్థరైటిస్ రోగులకు ఇది భలేగా సహాయపడుతుంది. చాలా చిన్నగా ఉండటంతో జేబులో, బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీనికింద ఉండే చిన్న బాక్సులో మందులను భద్రపరుచుకునే వీలు ఉంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మందులు వేసుకోవడానికి ఓ చక్కని తోడు. ఇంట్లో పెద్దవారు ఉన్నా, మీరు రెగ్యులర్‌గా మందులు వాడుతున్నా.. ఇదో చక్కని
యూజ్‌ఫుల్ పరికరం.
ధర: రూ. 112
దొరుకు చోటు: మీషో

ఇంట్లో పెద్దవాళ్లు, అనారోగ్యంతో ఉన్నవారుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో వారిని ప్రతి నిమిషం గమనిస్తూ ఉండటం కుదరకపోవచ్చు. వారు వేరే గదిలో ఉన్నప్పుడో, మనం పనుల్లో ఉన్నప్పుడో.. వారికి ఏదైనా సహాయం కావాలంటే? కొన్ని సందర్భాల్లో పిలవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా గట్టిగా అరిచి పిలవలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం Wireless Caregiver Pager ఓ అద్భుతమైన పరిష్కారం. ఇది ఆపద సమయంలో ఓ సైలెంట్ సెక్యూరిటీ గార్డ్‌లా పనిచేస్తుంది. ఇందులో ఓ రిసీవర్, మెడలో వేసుకునేలా రెండు ‘కాల్ బటన్లు’ ఉంటాయి. ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే.. ఆ బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు, వేరే గదిలో ఉన్న రిసీవర్ పెద్దగా మోగుతూ అప్రమత్తం చేస్తుంది. ఇది సుమారు 260 అడుగుల దూరం వరకూ పనిచేస్తుంది. రిసీవర్‌కు లైటింగ్ ఉంటుంది. దీంతో టీవీ శబ్దం ఎక్కువగా ఉన్నా, చీకటిగా ఉన్నా సరే ఎవరైనా పిలుస్తున్నారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. కేవలం వృద్ధులకే కాదు.. గర్భిణులు, చిన్న పిల్లలు, నడవలేని స్థితిలో ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ధర: రూ. 1,499
దొరుకు చోటు: అమెజాన్