లక్నో: బతికి ఉన్న రోగి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు, బంధువులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆ రోగి బతికి ఉన్నట్లు తెలుసుకుని వారు షాక్ అయ్యారు. (Declares Living Patient Dead) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల వినోద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అతడ్ని అడ్మిట్ చేసి వెళ్లిపోయారు.
కాగా, గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడు ఐదు రోజుల కిందట అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో పోలీసులు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వార్డులోని 43 బెడ్‌పై ఉన్న ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ డిసెంబర్ 27న మరణించాడు. అయితే 42 బెడ్‌పై ఉన్న వినోద్ చనిపోయినట్లుగా అతడి కేస్ షీట్‌పై జూనియర్ రెసిడెంట్ డాక్టర్ రాశాడు. దీంతో పోస్ట్‌మార్టం ప్రక్రియ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు వినోద్ బంధువులతో పాటు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని వారు షాక్ అయ్యారు. పక్కబెడ్‌పై ఉన్న వృద్ధుడి మరణించగా వినోద్ చనిపోయినట్లుగా డాక్టర్ తప్పుగా పేర్కొన్నట్లు తెలుసుకున్నారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ తర్వాత వినోద్ కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఈ సంఘటన ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేపింది. దీంతో వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. జూనియర్ రెసిడెంట్ డాక్టర్, నర్సుతో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు చేశారు.
Also Read:
Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఆత్మహత్య
Watch: వెనక నుంచి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్‌లోని కారు.. పోలీస్ అధికారికి గాయాలు