హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు(మంగళవారం) ఆదిలాబాద్ రానున్నారు. జిల్లా జైలులో(Adilabad Jail0 ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శిస్తారు. కాగా, బాల్కసుమన్‌ను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సంఖ్యాబలం లేకున్నా పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ చేయని దౌర్జన్యాలు లేవు.
పోలీసులు, అధికారుల అండదండలతో ఈ నెల 16వ తేదీ, 17వ తేదీల్లో క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక జరుగకుండా వాయిదా వేయించిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం తొలిరోజు వాయిదా వేయించడం, రెండో రోజు బీఆర్ఎస్ నాయకులను అనుమతించకుండా, కాంగ్రెస్ నాయకులను అనుమతించడంపై ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.