Vaibhav Sooryavanshi | 15 ఏళ్లకే నివ్వెరపరచిన వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే సిరీస్‌లో ఐదు చారిత్రాత్మక రికార్డులు!
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్‌కు మరో ఆణిముత్యం దొరికాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో తన పేలవైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 196.10 స్ట్రైక్ రేట్‌తో 151 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్‌కు మరో ఆణిముత్యం దొరికాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో తన పేలవైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 196.10 స్ట్రైక్ రేట్‌తో 151 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో వైభవ్ తన పేరిట నమోదు చేసిన ఐదు అరుదైన రికార్డులు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
1. అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ
తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 118 రోజుల వయసులో అర్ధశతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచి, నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
2. సచిన్ టెండూల్కర్ రికార్డుకు చెక్
భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ కొత్త చరిత్ర సృష్టించాడు. దాదాపు 37 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించి భారత క్రికెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.
3. 16 ఏళ్లు నిండకముందే రెండు టీ20 హాఫ్ సెంచరీలు
మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగులతో చెలరేగిన వైభవ్.. 16 ఏళ్లు పూర్తి కాకముందే రెండు అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీలు చేసిన ప్రపంచ తొలి ఆటగాడిగా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.
4. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల తరఫున అరుదైన ఘనత
ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన దేశం తరఫున ఆడుతూ.. 16 ఏళ్లలోపు రెండు అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత ఇప్పటివరకు మరే ఆటగాడికి దక్కలేదు.
5. అత్యంత పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 151 పరుగులు చేసి భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఆటగాడిగా మరో విశేష రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
నిర్భయంగా బ్యాటింగ్, భారీ షాట్లు, అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న ఈ యువ బ్యాటర్.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

