Naga Babu | గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారికి నాగబాబు అండ.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం
Naga Babu | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నాగబాబు మరోసారి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Naga Babu | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నాగబాబు మరోసారి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన కట్టా రామకృష్ణ జనసేన పార్టీకి అనుబంధంగా చాలా కాలంగా కార్యకర్తగా ఉన్నారు. ఆయన కుమారుడు శ్రీహర్ష గుండె సంబంధిత తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నాడు. గత 26 రోజులుగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వైద్యుల సమాచారం ప్రకారం చిన్నారి గుండె కేవలం 10 శాతం మాత్రమే రక్తాన్ని పంపింగ్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటివరకు చికిత్స కోసం కుటుంబం సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇంకా రూ.10 లక్షలు అవసరమవుతాయని వైద్యులు సూచించారు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న నాగబాబు వెంటనే స్పందించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా శ్రీహర్ష ప్రాణాలను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ వివరాలు, క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్ చేశారు.
నాగబాబు సహాయంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు, జనసేన కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.కాగా, గత కొద్ది రోజులుగా నాగబాబు లుక్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన అన్నయ్య చిరంజీవి స్ట్రాంగ్‌గా కనిపిస్తుంటే, నాగబాబు మాత్రం చాలా బక్కగా, నీరసించినట్టు కనిపిస్తుండడం అభిమానులని టెన్షన్ పెడుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

