Samantha Comments | విడాకుల తర్వాత పూర్తిగా కుంగిపోయా.. రాజ్ నా జీవితాన్ని మార్చాడు: సమంత ఎమోషనల్ వ్యాఖ్యలు
Samantha Comments | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత రూత్ ప్రభు తాజాగా తన వ్యక్తిగత జీవితంపై మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదన, ఆ తరువాత తన జీవితంలోకి వచ్చిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏర్పడిన బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగంగా స్పందించింది.
Samantha Comments | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత రూత్ ప్రభు తాజాగా తన వ్యక్తిగత జీవితంపై మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదన, ఆ తరువాత తన జీవితంలోకి వచ్చిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏర్పడిన బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగంగా స్పందించింది. మాజీ భర్త నాగ చైతన్య తో విడాకుల అనంతరం తాను పూర్తిగా కుంగిపోయానని సమంత తెలిపింది. “ఆ సమయంలో మానసికంగా చాలా బలహీనంగా మారిపోయాను. నా ప్రపంచాన్ని పూర్తిగా మూసేశాను. ఇకపై ఎవరినీ నమ్మకూడదని, ఇంకొకరిపై ఆధారపడకూడదని అనుకున్నాను. నా జీవితంలో ప్రేమ అనే భావన మళ్లీ చోటు చేసుకుంటుందని అసలు ఊహించలేదు” అని ఆమె చెప్పింది.
అయితే అదృష్టవశాత్తూ రాజ్ నిడిమోరు తన జీవితంలోకి రావడం ఒక మలుపుగా మారిందని ఆమె వెల్లడించింది. “అలాంటి ప్రేమను, స్నేహాన్ని అంగీకరించగలిగేంత సున్నితమైన మనసు అప్పటికీ నాలో మిగిలి ఉండటం నా అదృష్టం. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను. అందుకే మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. దానికి కారణం రాజ్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడమే” అని సమంత ఎమోషనల్ అయింది. తనలో వచ్చిన ఈ మార్పు తనకు మాత్రమే కాకుండా స్నేహితులకు కూడా స్పష్టంగా కనిపించిందని సమంత తెలిపింది. “కొద్దిరోజుల క్రితం నా పాత స్నేహితురాలు నన్ను కలిసింది. తరువాత ఆమె ఒక వాయిస్ నోట్ పంపింది. ‘ఇప్పుడే నిజంగా నువ్వు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇకపై నువ్వు ఏదీ నటిస్తున్నట్టుగా లేదు’ అని చెప్పింది. అది నాకు చాలా హత్తుకుంది” అని ఆమె వివరించింది.
రాజ్‌తో స్నేహం మొదలైన తర్వాత జీవితం పట్ల తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని సమంత వెల్లడించింది. సమంత, రాజ్ నిడిమోరు తొలిసారి 2021లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెట్స్‌లో కలుసుకున్నారు. రాజ్-డీకే ద్వయం తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషించింది. అక్కడ ప్రారంభమైన పరిచయం క్రమంగా బలమైన బంధంగా మారి, గత ఏడాది వారి వివాహానికి దారితీసింది. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తూ పూర్తి మద్దతు అందిస్తున్నాడు.వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను జయించి, కొత్త ఆరంభాన్ని స్వాగతించిన సమంత మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ, కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

