వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే ఓపెన్‌కాస్ట్ గనిలో వోల్వా వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్ బర్డెన్ మట్టి తరలింపు పనులు జరుగుతున్న సమయంలో 710 డంప్ యార్డ్ వద్ద మట్టిని అన్లోడ్ చేసి...
– మలుపు వద్ద పర్యవేక్షణ లేకపోవడంపై కార్మికుల ఆందోళన
రుద్రంపూర్, నవంబర్ 27 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే ఓపెన్‌కాస్ట్ గనిలో వోల్వా వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్ బర్డెన్ మట్టి తరలింపు పనులు జరుగుతున్న సమయంలో 710 డంప్ యార్డ్ వద్ద మట్టిని అన్లోడ్ చేసి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్న వోల్వా నంబర్ 1 వాహనంకు ఎదురుగా మరో వాహనం రావడంతో ఆగింది. అదే సమయంలో వెనుక నుండి అన్లోడ్ చేసి వస్తున్న వోల్వా నంబర్ 21 అదుపుతప్పి ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాహనాన్ని క్యాంపు సిబ్బంది పార్కింగ్ ప్రాంతానికి తరలించి, అనంతరం క్యాంపునకు చేర్చినట్లు తెలిసింది.
బ్రేకుల వైఫల్యమా.. అతివేగమా?
వోల్వా వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మరోవైపు మితిమీరిన వేగం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
ఎస్ఎంపీ అమలుపై ప్రశ్నలు
ఓపెన్‌కాస్ట్‌లో ప్రామాణిక గనుల నిర్వహణ విధానం (ఎస్ఎంపీ) సమర్థవంతంగా అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గనిలో పనులు ప్రారంభమైనప్పటి నుంచి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బోనస్ విషయంలో కార్మికులు ఎనిమిది రోజులపాటు సమ్మె చేసిన నేపథ్యంలో కిష్టారం కేఎల్పీ నుండి వచ్చిన కొందరు డ్రైవర్లు తీసుకొని వచ్చారని. సమ్మె కాలంలో నిలిచిపోయిన పనులను పూడ్చుకోవాలని ఉద్దేశంతో తెచ్చిన డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, నిర్ణీత ట్రిప్పుల కంటే అధికంగా ట్రిప్పులు వేయాలనే ఒత్తిడి వల్ల కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన మూల మలుపు వద్ద తప్పనిసరిగా ఒక పర్యవేక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అక్కడ ఎవరినీ నియమించకపోవడం కూడా ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
పెద్ద ప్రమాదం జరగలేదు
ఈ ఘటనపై ప్రాజెక్టు అధికారిని వివరణ కోరగా, ఒక వాహనాన్ని మరో వాహనం వెనుక నుంచి ఢీకొన్నప్పటికీ వోల్వా వాహనం పాక్షికంగా దెబ్బతినడం జరిగిందని. డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన నమస్తే తెలంగాణకు తెలిపారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల పరిస్థితి, బ్రేకుల పనితీరుపై స్పష్టత రావాల్సి ఉంది. గనిలో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

