పాట్నా: సీఎం కాన్వాయ్‌లోని కారు ఒక పోలీస్ అధికారిపైకి దూసుకెళ్లింది. వెనుక నుంచి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పోలీస్ అధికారి గాయపడ్డారు. (Cop Injured) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం పాట్నాలోని దిదార్‌గంజ్ మార్కెట్ ప్రాంతానికి చేరుకున్నారు. గురు గోవింద్ సింగ్ 359వ జయంతి వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు.
కాగా, ఈ సందర్భంగా సీఎం నితీశ్ కాన్వాయ్‌లోని ఒక కారు వేగంగా వెనక్కి దూసుకొచ్చింది. వెనుక ఉన్న ట్రాఫిక్ డీఎస్పీని ఆ వాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆయన కిందపడిపోయారు. ఆ పోలీస్ అధికారి స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मुख्यमंत्री नीतीश कुमार के काफिले की गाड़ी ने DSP को पीछे से मारी टक्कर। प्रकाश पर्व की तैयारियों का जायजा लेने के लिए वे तख्त श्री हरमंदिर गुरुद्वारा पहुंचे थे।#NitishKumar #PrakashParv #Patna #GurdwaraVisit #BiharNews #ConvoyAccident pic.twitter.com/K2R8tub1Nd
— FirstBiharJharkhand (@firstbiharnews) December 26, 2025
Also Read:
Watch: చనిపోయిన తర్వాత కూడా.. టీచర్ తలపై కాల్చుతూనే ఉన్న దుండగులు