Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
Mallikarjun Kharge: మాజీ ప్రధాని దేవగౌడపై జోక్ చేశారు ఖర్గే. రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ సభ్యుల్ని నవ్వించారు. దేవగౌడ మమ్ముల్ని ప్రేమించారని, కానీ ఏమైందో ఏమో, మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కూడా నవ్వేశారు.
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ రాజ్యసభలో నవ్వులు పూయించారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న నేపథ్యంలో.. సభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సభలో జరిగిన అంశాలను ప్రస్తావించారు. తన రాజకీయ జర్నీ గురించి కొంత వివరించారు. ప్రస్తుత కాలపరిమితి ముగియడంతో.. మాజీ ప్రధాని దేవగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా వీడ్కోలు తీసుకుంటున్నారు. అయితే ఖర్గే తన ప్రసంగంలో దేవగౌడతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దేవగౌడ గతంలో దేశ ప్రధానిగా చేశారని, ఎన్నో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారని, ఆయన గత 54 ఏళ్లుగా తనకు పరిచయం ఉందని, ఆయనతో కలిసి పనిచేసినట్లు ఖర్గే తెలిపారు. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, తమతో డేటింగ్ చేసి, తమను ప్రేమించిన అతను.. ప్రధాని మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ నవ్వేశారు. అక్కడే ఉన్న ప్రధాని మోదీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
1996 లోక్సభ ఎన్నికల తర్వాత ఓ ఏడాది కాలం పాటు ప్రధానిగా దేవగౌడ చేశారు. యూనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆ ఫైట్లో ఆ కూటమి గెలిచింది. హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ 2019లో ఆ ప్రభుత్వం కూలింది. ఆ తర్వాత బీజేపీతో జేడీఎస్ జతకట్టిన విషయం తెలిసిందే. ఖర్గే తన ప్రసంగంలో మాట్లాడుతూ.. శరద్ పవార్, తిరుచ్చి శివతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ ఇద్దరీ మళ్లీ రాజ్యసభలోకి ఎంటర్కానున్నారు. కేంద్ర మంత్రి అత్వాలే గురించి ప్రస్తావిస్తూ.. ఆయన తన పద్యంలోని ప్రధాని మోదీని మెచ్చుకుంటారని, ఇక ఆయనకు మరో పద్యం రాదు అని అన్నారు. దీంతో సభ్యులు నవ్వుకున్నారు.
VIDEO | Parliament Session: Congress president Mallikarjun Kharge in Rajya Sabha, says, “I have known H D Deve Gowda for decades, but I don’t know what happened recently. He expressed love for us, but married PM Modi’s party.”#ParliamentSession #RajyaSabha
(Source: Third… pic.twitter.com/8nfXsANqI6
— Press Trust of India (@PTI_News) March 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

