KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) గురువారం తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు(Tribute) అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 75వ సారి ఇవాళ ఆయన ఢిల్లీలో ఉన్నడు. ముఖ్యమంత్రి అయి 32 నెలలు కూడా కాలేదు.. రేపటితోనో, ఎల్లుండితోనో అవుతయి. కానీ 13 రోజులకోసారి ఢిల్లీ పోతడు.. 2,3 రోజులు అక్కడుంటడు. దేహి దేహీ అని ఈ రోజు అక్కడ యాచిస్తున్నడు. మరి యాచిస్తున్నడో..? వాళ్లకు ఇచ్చొస్తున్నడో.. కానీ మొత్తానికి ఢిల్లీ వాళ్లను యాచించి.. ఢిల్లీ వాళ్ల ముందు గులాంగిరీ చేసుడు.. అందుకే జయశంకర్ సార్ ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు.. స్వతంత్రులుగా ఉండాలే అని కోరుకున్నరని అన్నారు.
ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్థిత్వ పతకా ఉండాలే. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా ఎవరితో కాంప్రమైజ్ కాకుండా గొంతు విప్పితే ఒక సింహం లాగా గర్జించే విధంగా కేసీఆర్ తీరుగా గొంతు ఉండాలే.. అందుకే కాంగ్రెస్లో కలవొద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి పోయాడు
13 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి వాళ్ల దగ్గర యాచిస్తున్నాడో, వాళ్లకి ఇచ్చొస్తున్నాడో తెలీదు మరి
జయశంకర్ సార్ మనల్ని ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలని కోరుకున్నాడు
స్వీయ రాజకీయ అస్తిత్వమే… https://t.co/DQ9EhlGa3N pic.twitter.com/KtVtHIDbPb
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026