Robot Arrest | రోడ్డుపై వృద్ధురాలిని భయపెట్టిన రోబోను అరెస్ట్ చేసిన పోలీసులు.. Video
Robot Arrest | నేరానికి పాల్పడితే మనుషులను అరెస్ట్ చేయడం సాధరణ విషయమే. కానీ రోబో (Robot) ను అరెస్ట్ చేయడం మాత్రం అసాధారణమైన విషయం. కానీ చైనా (China) దేశంలోని మకావు (Macau) లో పోలీసులు రోబోను అరెస్ట్ చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి (Elder Woman) ని భయపెట్టిందనే కారణంతో రోబోను అదుపులోకి తీసుకున్నారు. రోబో భయపెట్టడంవల్ల ఆ వృద్ధురాలు ఏకంగా ఆస్పత్రిపాలు కావడం ఇక్కడ గమనించదగిన విషయం.
Robot Arrest : నేరానికి పాల్పడితే మనుషులను అరెస్ట్ చేయడం సాధరణ విషయమే. కానీ రోబో (Robot) ను అరెస్ట్ చేయడం మాత్రం అసాధారణమైన విషయం. కానీ చైనా (China) దేశంలోని మకావు (Macau) లో పోలీసులు రోబోను అరెస్ట్ చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి (Elder Woman) ని భయపెట్టిందనే కారణంతో రోబోను అదుపులోకి తీసుకున్నారు. రోబో భయపెట్టడంవల్ల ఆ వృద్ధురాలు ఏకంగా ఆస్పత్రిపాలు కావడం ఇక్కడ గమనించదగిన విషయం.
వివరాల్లోకి వెళ్తే.. వారం రోజుల క్రితం మకావులోని ఓ వీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ నడుస్తూ వెళ్తున్నది. ఆ సమయంలో సుమారు 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న ఒక చిన్న హ్యూమనాయిడ్ రోబో తనను అనుసరిస్తున్నట్లు ఆమె గమనించింది. భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన ఆమె.. ఆ రోబో రూపాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురైంది. ‘ఎందుకు నా వెంట పడుతున్నావ్.. నీకు పిచ్చిపిచ్చిగా ఉందా..?’ అంటూ ఆమె రోబోపై కేకలు వేసింది.
కానీ అప్పటికే తీవ్రంగా భయపడిన ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రోబో వృద్ధురాలిని వెంబడించిన వీడియో వైరల్‌గా మారింది. రోబో వృద్ధురాలిని భయపెట్టిన ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వృద్ధురాలి ఫిర్యాదుతో ఆ రోబోను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే రోబో వృద్ధురాలిని టచ్ చేయలేదని, కేవలం తన చేష్టలతో భయపెట్టిందని ప్రత్యక్ష సాక్షలు చెప్పారు.
పోలీసుల దర్యాప్తులో ఆ రోబో స్థానిక ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందినదని తేలింది. సంస్థ ప్రచారం కోసం 50 ఏళ్ల వ్యక్తి ఆ రోబోను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ పరీక్షిస్తున్నాడు. అదే సమయంలో వృద్ధురాలిని అనుసరించాడు. ఆమె భయపడటంతో రోబోతో కొన్ని వెకిలిచేష్టలు చేయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రోబో యజమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాదచారుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు.
🤖 Robot detained in Macau — It harassed a 70-year-old woman
In Macau, police detained a humanoid robot Unitree G1 after a complaint from a passerby, reports Bild.
The robot frightened a 70-year-old woman on the street — it approached her and refused to move away. The woman… pic.twitter.com/yUQn4mMjee
— NEXTA (@nexta_tv) March 15, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

