మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు
‘సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగం చేశారు. గంటకుపైగా చెత్తవాగుడు, పిచ్చి ప్రగల్భాలు తప్ప ప్రజల ఎజెండా లేదు. సిద్దిపేటకు చిల్లిగవ్వ లేదు. రేవంత్‌రెడ్డి మాటల్లో వజన్ లేదు. చేతల్లో విజన్ లేదు ’అని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
- సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగం
- రైతాంగానికి ఊరటలేదు
- రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావన లేదు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగం చేశారు. గంటకుపైగా చెత్తవాగుడు, పిచ్చి ప్రగల్భాలు తప్ప ప్రజల ఎజెండా లేదు. సిద్దిపేటకు చిల్లిగవ్వ లేదు. రేవంత్‌రెడ్డి మాటల్లో వజన్ లేదు. చేతల్లో విజన్ లేదు ’అని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో సీఎం తనతోపాటు కేసీఆర్‌పై చేసిన విమర్శలపై గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. వెకిలితనం, వెగటుతనం, బూతుమాటలు, రోతకూతలు, వెర్రివాగుడు, తిర్రిమాటలు తప్ప ప్రజలకు పని కొచ్చేదేమీలేదని ఎద్దేవా చేశారు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదని, సిద్దిపేటకు నిలిపేసిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదని మండిపడ్డారు.
‘నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్లు, నోటి దుర్గంధాన్ని కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? అని నిలదీశారు. ఆరునెలలుగా ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసెత్తకుండా ఊసరవెల్లిలా మాట్లాడారని ధ్వజమెత్తారు. చెల్లని రూపాయికి గీతలు ఎకువ, చిల్లర సీఎంకు బూతులు ఎకువని చురకలంటించారు. తాడిచెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీషేమింగ్ తప్ప, అకరకు వచ్చే ముచ్చట ఒకటీ లేదని విమర్శించారు. ‘భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడిచెట్టు సమోన్నతంగా ఎదుగుతుంది. ఈదురుగాలులు వీచినా, తుఫాన్లు వచ్చినా ఉకులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకిపడగ చెట్లకు తాడిచెట్టు విలువ తెలియదు’ అంటూ హరీశ్‌రావు తనదైన శైలిలో జవాబిచ్చారు. గౌడన్నల కల్పతరువు తాడిచెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవుళ్లను మోసం చేసినందుకే కరువు
‘తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం.. పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటేనని స్పష్టంచేశారు. శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కేసీఆర్ నిలబెడితే, ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కాదా? అని ప్రశ్నించారు. అది సౌకర్యంగా మరిచిపోయావా? సంకర నాయకుడా? అని నిలదీశారు.
కేసీఆర్ పథకాలేవీ రద్దు చేయలేదా?
రేవంత్‌రెడ్డి అబద్ధాలకు హద్దు లేదని, కేసీఆర్ పథకాలను రద్దు చేయలేదని చెప్పడం సిగ్గుచేటని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మీ, ఫీజు రీయింబర్స్ంట్, దళితబంధు, రైతుబీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు- మన బడి, కంటివెలుగు, ఇట్ల రేవంత్ సర్కార్ బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉన్నదని స్పష్టంచేశారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ అని గుర్తుచేశారు.
హామీలేవి?: ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సిదిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం తిట్ల దండకం, పచ్చి అబద్ధాలతోనే ముగిసిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. తీవ్ర కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతుల కన్నీళ్లు తుడిచే ప్రస్తావన లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేయడం తప్ప ముఖ్యమంత్రి ఒక విలువైన మాట చెప్పలేదని, సిద్దిపేటకు నిధులు మంజూరు చేయలేదని, కొత్త హామీలివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బాధ్యతారాహిత్యం : ఎమ్మెల్సీ దేశపతి
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ఆద్యంతం విషం చిమ్మడం విదూషత్వాన్ని ప్రదర్శించడం తప్ప విలువైన మాట ఒకటీ లేదని అన్నారు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలపై మాట్లాడకుండా కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకే సీఎం ప్రసంగం పరిమితమైందని ఆరోపించారు. ఎంతో ఊరించిన ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకం ప్రస్తావన కూడా చేయలేదని విమర్శించారు.
సీఎం వ్యాఖ్యలు అవాస్తవం : కొప్పుల
సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవాల పుట్ట అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన సిద్దిపేటలో అబద్ధపు హామీలతో ప్రజలను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రేవంత్ సభ అట్టర్‌ప్లాప్ : ఎర్రోళ్ల శ్రీనివాస్
సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి సభ అట్టర్‌ప్లాప్ అయిందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌పై విషప్రచారానికే సీఎం ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. హరీశ్‌రావును ఎదురొనేందుకు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కదిలినా సిద్దిపేట ప్రజలు హరీశ్‌రావు వెంటే ఉంటారని పేర్కొన్నారు.
సిద్దిపేటలో సీఎం పిరికిపంద చర్యలు : దాసోజు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల మద్దతే నిజంగా మీకుంటే.. సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టడానికి 10 జిల్లాల నుంచి 3,000 మందికి పైగా పోలీసులు, తెల్లవారుజాము నుంచే అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్‌రెడ్డి గారూ?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సీఎం సభ మొదలవ్వకముందే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలను పోలీసు దిగ్బంధనంలోకి నెట్టారని, 1,000 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నేతలను అక్రమంగా అరెస్ట్‌చేసి ఎకడికో తరలించారని, ఇది పిరికితనం కాదా? అని ప్రశ్నించారు.
చివరికి పార్టీ ఫ్లెక్సీలను కూడా రాత్రికి రాత్రే తొలగించి, పకజిల్లాల నుంచి బస్సుల్లో జనాలను తరలించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. సిద్దిపేటలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల నిధులపై ప్రజలు నిలదీస్తారని, వెటర్నరీ కాలేజీని తరలించి, యంగ్ ఇండియా సూళ్లలో సిద్దిపేటకు మొండిచేయి చూపినందుకు సమాధానం చెప్పలేక, రుణమాఫీ, రైతు భరోసా హామీల మోసంపై రైతులు ప్రశ్నిస్తారనే భయంతో ఇలాంటి చర్యలకు దిగారా? అని ప్రశ్నించారు. ‘నోరు విప్పకముందే ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో పెట్టడం పాలన కాదు. అది మీ భయానికి, నియంతృత్వానికి నిదర్శనం. దమ్ముంటే పోలీస్ వలయం లేకుండా ప్రజల మధ్యకు రండి, సమాధానం చెప్పండి’ అని సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

