పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు!
తనకు బదిలీలు కొత్త కాదని.. తన 26 ఏండ్ల ఐపీఎస్ సర్వీసులో ఇప్పటికి 21 సార్లు బదిలీ అయ్యానని అగ్నిమాపకశాఖ నూతన డైరెక్టర్ జనరల్ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని అగ్నిమాపకశాఖ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నూతన డీజీగా బాధ్యతలు స్వీకరించారు.
- 26 ఏండ్లలో 21సార్లు బదిలీ అయ్యా: సజ్జనార్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తనకు బదిలీలు కొత్త కాదని.. తన 26 ఏండ్ల ఐపీఎస్ సర్వీసులో ఇప్పటికి 21 సార్లు బదిలీ అయ్యానని అగ్నిమాపకశాఖ నూతన డైరెక్టర్ జనరల్ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని అగ్నిమాపకశాఖ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నూతన డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్ఫర్స్ను ఉద్యోగ జీవితంలో సహజ పరిణామంగా చూస్తానని, వాటి గురించి ఆలోచించకుండా తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెడతానని సజ్జనార్ చెప్పారు. తనపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావును ఉద్దేశించి.. ‘కొందరు వ్యక్తిగత ప్రచారం కోసం నా పేరు, ఫొటోలు ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కాంట్రవర్సీల జోలికి వెళ్లను. కానీ, అందరి చరిత్రలు ప్రజలకు తెలుసు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఈ విషయాలపై త్వరలోనే అవసరమైన లీగల్ చర్యలు తీసుకుంటాను’ అని పేరొన్నారు. పాత భవనాలు, పాఠశాలలు, దవాఖానలు, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

