కోయిల్‌సాగర్‌కు మరణ శాసనం
పాలమూరు జిల్లాలో మరో నీటి యుద్ధానికి తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కోసం రెండు జిల్లాల్లో నీళ్ల చిచ్చుపెట్టారు.
- పాలమూరు జిల్లాలో రేవంత్ నీళ్ల చిచ్చు
- ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం నీళ్లు తరలించే యత్నం
- కొడంగల్ నియోజకవర్గమంతటా తాగునీరు ఇస్తారట
- గుట్టుగా పరిపాలన అనుమతులు జారీ చేసిన సర్కార్
- కంగుతిన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. రైతుల్లో ఆందోళన
మహబూబ్‌నగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లాలో మరో నీటి యుద్ధానికి తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కోసం రెండు జిల్లాల్లో నీళ్ల చిచ్చుపెట్టారు. కొడంగల్ నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం ఏకంగా రూ.490 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్ కోసం గుట్టుగా పరిపాలన అనుమతులు మంజూరు కావడం పాలమూరు జిల్లా లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫైల్ కదలడం.. అనుమతులు రావడంతో కంగుతిన్నారు. ఇదే కనుక జరిగితే కోయిల్ సాగర్ ఆయకట్టు తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది.
ఇప్పటికే నీళ్లు లేక వందలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోయాయి. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేస్తున్నారు. కృష్ణా నదికి భారీ వరద వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోయిల్ సాగర్‌కు నీటిని ఎత్తిపోయకపోవడంతో వర్షాధారంతో వచ్చిన నీళ్లే దిక్కయ్యాయి. ఈ ప్రాజెక్టు వాస్తవ ఆయకట్టు 12 వేల ఎకరాలు కాగా.. జూరాల బ్యాక్‌వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసి ఆకట్టును 50 వేలకు పెంచారు. ఎప్పుడు కూడా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక నిరంతరాయంగా కృష్ణా నీటిని ఎత్తిపోయడంతోపాటు ఊక చెట్టి వాగు కృష్ణా నదిలో కలిసే వరకు సుమారు 17 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు.
ఈ చెక్ డ్యామ్‌లు ఆయకట్టు నీళ్లతోపాటు గరిష్ఠంగా 60 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నీటిని ఎత్తిపోయకపోవడంతో ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వలేదు. ఈ ఏడాది కృష్ణా నదికి సుమారు 56 రోజులపాటు వరద వచ్చినప్పటికీ ప్రభుత్వం అర టీఎంసీలోపు నీటిని తరలించింది. ప్రస్తుతం 1.13 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. కోయిల్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 2.17 టీఎంసీలు. ప్రస్తుతం ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఆందోళన చెందుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకెళ్లేందుకు పూనుకోవడం కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
కొడంగల్ తాగునీటికి కోయిల్‌సాగర్ నీళ్లా?
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు.. మద్దూరు కోస్గి మున్సిపాలిటీలతోపాటు బొమ్మరాస్ పేట, దుద్యాల, కొత్తపల్లి, గుండు, మాల్, దౌల్తాబాద్ మండలాలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక పైప్‌లైన్‌ను ప్రతిపాదించారు. దుద్యాల మండలంలో నిర్మిస్తున్న పారిశ్రామిక పార్క్‌కు కూడా ఈ నీటిని తరలించడంతోపాటు అక్కడ ఏర్పాటు చేస్తున్న ఎడ్యుకేషన్ హబ్‌కు కూడా తాగునీటిని సరఫరా చేస్తారు. రోజూ కోయిల్ సాగర్ నుంచి 40 మిలియన్ లీటర్ల నీటిని తరలించాలని, పోలేపల్లి వరకు కోయిల్ సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పైప్‌లైన్‌తో నీళ్లను అందించాలని ప్రతి పాదించారు. దీనికోసం సుమారు రూ.490 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో టెండర్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

