83 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివరి గంటలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సెన్సెక్స్ తిరిగి 83 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
- తొమ్మిది నెలల గరిష్ఠానికి సూచీ
ముంబై, నవంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివరి గంటలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సెన్సెక్స్ తిరిగి 83 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 989.94 పాయింట్లు లేదా 1.21 శాతం లాభం 83,021.75 వద్ద స్థిరపడింది. దీంతో సూచీ తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు అయింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 286.35 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగబాకి తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి 25,514.30 వద్దకు చేరుకున్నది.
టాప్ గెయినర్‌గా మారుతి
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ షేరు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. కంపెనీ షేరు 7.58 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా 4.78 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.38 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 4.22 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 2.12 శాతం, ఎస్బీఐ షేరు 2.11 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు వెనుకబడ్డాయి.
ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర పెట్టుబడులు దేశీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా ఆటో 3.98 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్ 2.43 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.28 శాతం, కన్జ్యూమర్ డిస్కెష్రనరీ 2.26 శాతం, బ్యాంకింగ్ 1.80 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.77 శాతం, పవర్ 1.74 శాతం, టాప్ 10 బ్యాంకింగ్ 1.65 శాతం పెరిగాయి. కానీ, ఐటీ, టెలికమ్యూనికేషన్, ఫోకస్డ్ ఐటీ సూచీలు వెనుకబడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

