సీఎం భూ దోపిడీ
‘సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వాటిని క్లియర్ చేసి దోచుకుంటున్నరు. ఇప్పటి వరకు దోచుకున్న ఆ భూముల విలువ ఏకంగా రూ. 5 లక్షల కోట్ల వరకు ఉంటుంది’ అంటూ ముఖ్యమంత్రి అవినీతిని సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బట్టబయలు చేశారు. ఈ మేరకు గురువారం ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
- ప్రైవేట్ వ్యక్తులతో కలిసి భారీగా కబ్జాలు
- హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల్నీ వదలట్లేదు
- మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!
- రేవంత్ పాలనలో అవినీతి 100 శాతమైంది
- ముఖ్యమంత్రి కరప్షన్‌తో కాంగ్రెస్‌కు తీవ్రనష్టం
- ప్రాజెక్టుల పేరుతో అప్పులు.. వాటిలో కమీషన్లు
- ఆరు వేల కోట్ల అప్పు తెచ్చి కొడంగల్‌కు రోడ్డా?
- పేరుకే కాంగ్రెస్ సర్కార్, నడిపేది చంద్రబాబు
- ఇంతటి దోపిడీ జరుగుతున్నా మాట్లాడవద్దా?
- కాంగ్రెస్ అధిష్ఠానం చర్య తీసుకున్నా నేను రెడీ
- మరోసారి రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
హైదరాబాద్/ నల్లగొండ ప్రతినిధి, నవంబర్19 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వాటిని క్లియర్ చేసి దోచుకుంటున్నరు. ఇప్పటి వరకు దోచుకున్న ఆ భూముల విలువ ఏకంగా రూ. 5 లక్షల కోట్ల వరకు ఉంటుంది’ అంటూ ముఖ్యమంత్రి అవినీతిని సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బట్టబయలు చేశారు. ఈ మేరకు గురువారం ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ భూములను దోచుకున్న ఆదాయానికి తోడు.. అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన రూ.3-4 లక్షల కోట్ల అప్పుల నిధులు కూడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లినట్టు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అవినీతి 100 శాతం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. ఎక్కడైనా రూ. 100 కోట్ల పని చేస్తే అందులో రూ. 50 కోట్లు సొంత వారి జేబుల్లోకి పోతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గాలకు మాత్రం ఇప్పటి వరకు నిధుల్లేవు, అభివృద్ధిలేదని విమర్శించారు. ‘ప్రజలకు తాగునీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు.. అన్నీ కష్టాలే’నని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం దోపిడీ బయట తెలియదు
‘రేవంత్‌రెడ్డిని ఎవరూ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయనను ఏమీ చేయాల్సిన పనిలేదు. ఆయన చేస్తున్న పనుల వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి మాట్లాడే విధానం, తీసుకునే నిర్ణయాలు, తెరచాటున నడిపే వ్యవహారాలు, కాంట్రాక్టులు, భూము లు, కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నది. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియదు. ఇక్కడ ఎంత పెద్ద దోపిడీ జరుగుతున్నదో నాకు తెలుసు’ అంటూ రాజగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారు.
భయపడి ఇంట్లో కూర్చోవాలా?
‘ ఆంధ్రా కాంట్రాక్టర్లు, చంద్రబాబు మనుషులు లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకుంటున్నరు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, దుర్మార్గం పెరిగినప్పుడు పోరాటం చేయాల్సిందే.. అంతేగానీ భయపడి ఇంట్లో కూర్చోలేం కదా?’ అంటూ రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. పదవి కోసమో, కాంట్రాక్టు కోసమో రేవంత్‌రెడ్డితో లాలూచీ పడాలా.? లేదా కొట్లాడాల్నా? అని ప్రశ్నించారు. భగవంతుడిపై, రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చిన వాళ్లే అవినీతికి పాల్పడుతుంటే పోరాటం చేయకుండా ఏం చేయాలి? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ పేదవాడికీ న్యాయం జరుగడం లేదని, ఏ పనీ కావడంలేని, ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరుగడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో పేదలు అత్యంత పేదలుగానే మిగిలిపోతున్నారని, ధనవంతులు, మేగా కృష్ణారెడ్డిలాంటి వాళ్లు ఎదిగిపోతున్నారని ఆరోపించారు.
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే!
‘నా మనసులో ఉన్న బాధనే చెప్తున్నా.. అంతేకానీ పదవుల కోసం కాదు’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. నాలుగు గోడల మధ్య బతిమాలిడితే వినడం లేదని, అందుకే తమ ఆవేదనను బహిరంగంగా చెప్తున్నానని స్పష్టంచేశారు. ‘ఎన్నికలప్పుడు మనమే హామీలిచ్చి నం.. వాటిని నెరవేర్చాలని అడగడం తప్పా?’ అని ప్రశ్నించారు. ‘మూడేండ్లు మాట్లాడలేదు.. ఇప్పుడు మాట్లాడుతున్నా.. ఇప్పటికీ మాట్లాడకుంటే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలకు నష్టం జరుగుతది. నా మాటలతో వారికి న్యాయం జరిగితే చాలు. పార్టీ నాకు ఏ శిక్ష వేసినా సరే’ అని తేల్చిచెప్పారు. వీటన్నింటిపై మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నా అంటున్నారని, కానీ తనకు పదవులు అవసరం లేదని, కండ్ల ముందు అన్యాయం జరుగుతున్నది కాబట్టే మాట్లాడుతున్నానని స్పష్టంచేశారు. పదవి కావాలని, పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.
రేవంత్‌కు ఇకనైనా జ్ఞానోదయం కావాలి
రేవంత్‌రెడ్డి అదృష్టం బాగుండి ముఖ్యమం త్రి అయ్యారని, 65 మంది కలిస్తేనే ఆయనకు పదవి దక్కిందని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశా రు. 24 గంటలూ ప్రతిపక్షాలను తిట్టుకుంటూ, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఆయన భాష మంచిగా లేకపోతే ప్రజలు అడుగుతారని, సొం త పార్టీ నేతలు కూడా అడుగుతారని స్పష్టంచేశారు. ‘పండవెట్టి తొక్కుతా’ అంటూ సీఎం మాట్లాడటం ఎంత వరకు సబబని ప్రశ్నించా రు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాషే నా అని ప్రశ్నించారు. ‘రేవంత్‌కి ఇకనైనా జ్ఞానోదయం కలగాలని, హుందాగా ఆయన హోదా కు తగ్గట్టు ప్రవర్తించాలి’ అని హితవుపలికారు.
పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం.. నడిపేది చంద్రబాబు మనుషులే
‘రాష్ట్రంలో పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొత్తం చంద్రబాబునాయుడు మనుషులే నడిపిస్తున్నరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదేం కాంగ్రెస్ పార్టీ?’ అని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘చంద్రబాబు మనుషులకు పెత్తనం ఇవ్వొద్దు.. ఆయన చెప్పుచేతుల్లో ఈ ప్రభుత్వం పనిచేయెద్దు’ అని ఫైర్ అయ్యారు. బుధవారం మునుగోడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం సాయంత్రం పలు టీవీ చానళ్లకు ఇంటర్యూ ఇస్తూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ‘అయ్యప్పమాల వేసుకొని చెప్తున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు. పద్ధతి మార్చుకోకపోతే మళ్లీ అధికారంలోకి రాదు’ అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.
అప్పులు చేసి కమీషన్లు
‘ప్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అంటూ రేవంత్‌రెడ్డి అప్పులు చేస్తున్నాడని, ఇట్లా అప్పులు చేసి చేపడుతున్న ప్రాజెక్టుల టెండర్లలో పారదర్శకత ఉండదని, తక్కువ కోట్ చేసినోళ్లకు టెండర్లు రానివ్వరని, ఎక్కువ కోట్ చేసినోళ్లకు కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఇలాంటి తప్పులు జరగొద్దనేదే తన ఉద్దేశమని, ఇట్లా అప్పులు చేసుకుంటూ అవినీతికి పాల్పడితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ 90 శాతం పూర్తిచేసింది
‘మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు చౌటుప్పల్‌లో 100 పడకల హాస్పిటల్‌ను మంజూరు చేసి నాడే 90 శాతం పనులు పూర్తి చేసిండ్రు. మూడేండ్లల్లో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నం’ అని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహను కలిసినా నిధులు ఇవ్వడం లేదని, దీని వల్ల ఎంతో మంది పేదలు నాణ్యమైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే పదవీ త్యాగానికైనా సిద్ధమేనని హెచ్చరించారు.
6 వేల కోట్ల అప్పుతో కొడంగల్‌కు రోడ్డు అవసరమా?
ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ప్రతి పైసాను జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ రేవంత్‌రెడ్డి అప్పులు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. కొడంగల్‌కు రేడియల్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అని, ఎక్కువ ధరకు కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. చేవెళ్ల నుంచి నేషనల్ హైవే అవుతున్నదని, అయినా అదనంగా రోడ్డు కోసం రూ. 5-6 వేల కోట్లు అప్పు తెచ్చి ఖర్చుచేసి కొడంగల్‌కు రేడియల్ రోడ్డు ఎందుకు వేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి రూ.10 వేల కోట్లు తీసుకుపోతే.. అందులో తమకు ఎంతో కొంతనైనా ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమత్రి కాదు కదా? అని నిలదీశారు.
రూ.200 కోట్ల స్కూల్స్ ఎందుకు?
‘చాలా ప్రభుత్వ హాస్టళ్లల్లో కనీస వసతులు లేవు. బాత్రూంలు లేవు. బెంచీలు లేవు. కుర్చీలు లేవు. సరైన గదుల్లేవు. ఇవి పట్టించుకోకుండా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు? ఇవే నిధులతో మండలాల్లో 20 స్కూల్స్ నిర్మిస్తే 2 వేల మంది చదువుకోవచ్చు’ అని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ఉన్న వాటిల్లోనే వసతులు లేనప్పుడు అప్పులు చేసి ఆర్భాటాలకు పోవడం ఎందుకని నిలదీశారు.‘సీఎం వద్దనే మున్సిపల్, హోమ్, విద్యాశాఖలు ఉంటాయి. ఖాళీగా ఉన్న మరో రెండు మూడింటిని నింపరు. వీటిని నిజాయితీపరులైన నేతలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

