MP Shanmugam : తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు తమ నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో నిలుస్తున్నారు. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ (MP Shanmugam) మాటల మధ్యలో నోరు జారారు. ‘నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా?’ అని ఆయన స్టాలిన్ను ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఎన్నికల సందడి మొదలవ్వడంతో తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. ఎన్నికల తేదీ రావడంతో ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో మీ కలలు చెప్పండి. మేము నెరవేరుస్తాం? అని సీఎం స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు. అయితే.. ఈ పథకంపై అన్నాడీఎంకే నాయకులు సెటైర్లు వేస్తున్నారు.
నాకు నయనతార కావాలి.
సీఎం స్టాలిన్ మీ కలలు చెప్పండి మేము నెరవేరుస్తాము అంటున్నాడు కదా మరి నాకు నయనతార కావాలి,
నా కల నెరవేరుస్తారా?
– ఏఐడీఎంకే ఎంపీ షణ్ముగన్#nayanatara #cmstalin #TamilNadu #aidmk #mpshanumgan #UANow pic.twitter.com/RZVp16EzOS— UttarandhraNow (@UttarandhraNow) March 17, 2026
విల్లుపురంలో డీఎంకే ప్రభుత్వంపై నిరసన సభలో ముఖ్యమంత్రి కొత్త పథకాన్ని అన్నాడీఎంకే ఎంపీ, మాజీ మంత్రి షణ్ముగన్ విమర్శించారు. అంతటితో ఆగకుండా ‘నాకు నయనతార కావాలి. నా కోరిక నేరవేరుస్తారా. నయనతారను పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్ల కలను సీఎం నిజం చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని డీఎంకే నేతలు, దక్షిణాది చిత్రసీమ వర్గాలు సహా పలువురు ఖండించారు.
డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఎంపీ షణ్ముగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ‘మా పార్టీ విధానాలను విమర్శించండి. అంతేతప్ప మహిళలపై అసభ్యకరమైన కామెంట్లు చేయకండి. నయనతారను అవమానపరచడం ద్వారా మొత్తం మహిళలను ఎంపీ అవమానించారు. సభ్యతగల సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారం కాదు’ అని పేర్కొన్న సయ్యద్ అన్నాడీఎంఏ పార్టీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
#WATCH | Chennai, Tamil Nadu: On AIADMK Leader CV Shanmugam’s statement on actress Nayanthara, DMK Spokesperson Saravanan Annadurai says, “It’s a disgusting statement made by CV Shanmugam. He has to make a public apology… This is not the first time he has made such derogatory… pic.twitter.com/7T5kVr1AtI
— ANI (@ANI) March 17, 2026
రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న షణ్ముగన్ మహిళలపై నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. నిరుడు ఆయన సీఎంను విమర్శిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత పెళ్లాం అనే పథకాన్ని ప్రవేశ పెట్టినా పెడతారు అని విమర్శించారు. అప్పుడు సైతం ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీని ఎన్నికలు జరుగననున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
నాకు నయనతార కావాలి
తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సీఎం స్టాలిన్ మీ కలలు చెప్పండి మేము నెరవేరుస్తాము అంటున్నాడు
నాకు నయనతార కావాలి నా కల నెరవేరుస్తారా? –ఏఐడీఎంకే ఎంపీ షణ్ముగన్ pic.twitter.com/CMpFzRHSDi
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026