TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల
TS Assembly | కాంగ్రెస్ సర్కారు యూరియా యాప్ పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్ఫోన్లు లేవని, ఇక స్మార్ట్ ఫోన్లు ఉన్న 50 శాతం మందిలో కూడా 50 శాతం మందికి యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదని అన్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు యూరియా యాప్ పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్ఫోన్లు లేవని, ఇక స్మార్ట్ ఫోన్లు ఉన్న 50 శాతం మందిలో కూడా 50 శాతం మందికి యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదని అన్నారు.
ఇలా మొత్తంగా 75 శాతం మంది రైతులు యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. వారంతా మీ సేవా కేంద్రాలకు పోయి యూరియా బుక్ చేయించుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత మరో రోజు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇలా రెండు రోజులు సమయం రైతుకు వృథా అవుతున్నదని చెప్పారు. ఇక ఒక దఫాలో 5 బస్తాల కంటే ఎక్కువ యూరియా ఇవ్వడంలేదని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.
దాంతో మూడు నాలుగు ఎకరాల్లో మక్క పంట వేసిన రైతు మూడు దఫాల్లో రెండేసి రోజుల చొప్పున మొత్తం ఆరు రోజులు యూరియా కోసం తిరగాల్సి వస్తున్నదని చెప్పారు. మండలానికి ఒక్క కేంద్రంలో మాత్రమే యురియా ఇస్తుండటంతో చాలా గ్రామాల రైతులు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి మండలానికి ఒక్కచోట మాత్రమే కాకుండా ఎక్కువచోట్ల యూరియా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. దఫాకు 5 బస్తాల పరిమితిని ఎత్తేసి, రైతు వేసిన పంటకు ఎంత యూరియా అవసరమో అంతా ఒకేసారి ఇవ్వాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

