Sanju Samson Cheat Meal : పొట్టి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్(Sanju Samson) మూడు నెలలు కచ్చితమైన డైట్ ప్లాన్ పాటించాడు. మ్యాచ్‌లపైనే దృష్టి సారించాలనే ఉద్దేశంతో అతడు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉన్నాడు. అయితే.. మెగా టోర్నీ మధ్యలోనే సంజూకి తమ ప్రాంత వంటకాలపై మనసు మళ్లింది. వెంటనే తన మేనేజర్‌తో చెప్పి చెఫ్‌ను పురమాయించాడు. అంతే.. క్షణాల్లోనే అతడికి ఎంతో ఇష్టమైన కేరళం వంటకాలను చెఫ్ సిద్ధం చేసి పంపాడు. ఇంతకూ శాంసన్ ఏమేం రుచి చూశాడో తెలుసా..?
టీ20 ప్రపంచకప్ బిగ్ మ్యాచుల్లో హ్యాట్రిక్ అర్ధ శతకాలతో భారత విజయాల్లో సంజూ శాంసన్ కీలకమయ్యాడు. సూపర్ 8లో జింబాబ్వేపై మెరుపు బ్యాటింగ్ చేసిన సంజూ.. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 97 నాటౌట్‌తో చెలరేగి టీమిండియాను సెమీస్ చేర్చాడు. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ కోసం ముంబై చేరుకుంది భారత జట్టు. అప్పుడు సంజూకి తన ప్రాంతీయ వంటకాలు తినాలనిపించింది. సో.. ఇదే విషయాన్ని తన మేనేజర్‌కు చెప్పి చెఫ్ సురేశ్ పిళ్లై (Suresh Pillai)తో సిద్ధం చేయించాలని కోరాడు.
Behind every great performance on the world stage, there are sacrifices the world never sees.
The night Sanju Samson asked me for pazhankanji in Mumbai…March 2. 7 PM.
I received a call from Ikhlas, Sanju Samson’s manager and close companion.
“Chetaa… the match against West… pic.twitter.com/r4qBTW7OLJ
— suresh pillai (@chef_pillai) March 14, 2026
‘విశ్వవేదికపై గొప్ప ప్రదర్శన వెనుక దాగుండే కొన్ని త్యాగాలు ప్రపంచానికి కనిపించవు. ఆ రోజు రాత్రి సంజూ శాంసన్ తనకు ‘పజన్కంజీ’ (అన్నంతో చేసే ఒకరకమైన కేరళం సంప్రదాయ వంటంక) తినబుద్ధి అవుతుందని అడిగాడు. రాత్రి 7 గంటలకు అతడి మేనేజర్ ఇఖ్లాస్ నాకు ఫోన్ చేసి ”చేటా.. వెస్టిండీస్‌తో మ్యాచ్ గొప్పగా జరిగింది. శాంసన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం మేము ముంబైలో ఉన్నాం. గత మూడు నెలలుగా సంజూ కచ్చితమైన డైట్ పాటిస్తున్నాడు. అయితే.. ఈ ఒక్కరోజు రాత్రి అతడు చీట్ మీల్ చేయాలనుకుంటున్నాడు. సో.. కేరళం వంటకాలలైన పజన్కంజీ, చేపలు, కప్పా.. చమ్మంతీ వంటివి సిద్ధం చేయగలవా” అని అడిగాడు. అతడు పజన్కంజీ అడిగేసరికి నవ్వొచ్చింది. ‘ముంబైలో రాత్రి ఏడు గంటలకు పజన్కంజీ దొరకదు. కంజీ, కప్పా, చేపలు రెఢీ చేస్తాను’ అని చెప్పాను. వెంటనే ముంబైలోని సొసైటీ హోటల్ యజమాని అయిన నా స్నేహితుడు రస్సాక్ ఇక్కాకు ఫోన్ చేసి విషయం చెప్పాను.

నేను చెప్పడమే ఆలస్యం.. అతడు చకచకా శాంసన్ కోరిన వంటకాలు సిద్ధం చేయించాడు. కంజీ, కప్పా, చేపల కూర, సార్డిన్ చేపల ఫ్రై, చమ్మంతీ, పాపడ్.. వంటివి సంజూ బస చేసిన హోటల్‌కు పంపించాడు. ఇలాంటి సంఘటనలు నాకు ఎంతో ప్రత్యేకం అనిపిస్తాయి. ప్రేక్షకులు టీవీల్లో సంజూ ఆటనే చూస్తారు. కానీ, అతడి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మాత్రం చూడలేరు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలకు ముందు శాంసన్ ఫోన్ స్విచాఫ్ చేస్తాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. పూర్తిగా ఆటపైనే దృష్టి సారిస్తాడు. నిశబ్దంగా ఉండడం, నిలకడగా రాణించడం సంజూ స్పెషాలిటీ. క్రికెట్ కోసం తనకిష్టమైనవి త్యాగం చేసే శాంసన్ బ్యాటు అందుకొని మైదానంలోకి వచ్చేటప్పుడు లక్షలాది మంది మలయాళీలు గర్వపడుతారు’ అని పిళ్లై తన పోస్ట్‌లో వెల్లడించాడు.