అతనికి కల వరం.. ఆమెకు కలవరం!
కలలో వచ్చిన ఒక విషయం కారణంగా మీ భాగస్వామి ఎప్పుడైనా మీపై అలిగారా? ఈ మధ్య ఒక మహిళ ఏకంగా కన్నీళ్లే పెట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. తన భర్తకు కలలో సూల్ ఫ్రెండ్ కనిపించడమే ఆమె ఆవేదనకు కారణమైంది. భర్తకు అది కేవలం ఒక కల మాత్రమే అయినప్పటికీ, భార్య మాత్రం దాని గురించి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ కలలో మోసం చేయడాన్నే నిపుణులు ‘డ్రీమ్ చీటింగ్'గా చెబుతారు.
అతనికి కల వరం.. ఆమెకు కలవరం!
కలలో వచ్చిన ఒక విషయం కారణంగా మీ భాగస్వామి ఎప్పుడైనా మీపై అలిగారా? ఈ మధ్య ఒక మహిళ ఏకంగా కన్నీళ్లే పెట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. తన భర్తకు కలలో సూల్ ఫ్రెండ్ కనిపించడమే ఆమె ఆవేదనకు కారణమైంది. భర్తకు అది కేవలం ఒక కల మాత్రమే అయినప్పటికీ, భార్య మాత్రం దాని గురించి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ కలలో మోసం చేయడాన్నే నిపుణులు ‘డ్రీమ్ చీటింగ్’గా చెబుతారు.
డ్రీమ్ చీటింగ్ అనేది ఒక వ్యక్తి తన భాగస్వామితో కాకుండా వేరొకరితో సంబంధంలో ఉన్నట్లుగా సూచిస్తుంది. నిద్రలో రోజంతా సేకరించిన జ్ఞాపకాలు, భావోద్వేగాలు, వివిధ రకాల సమాచారాన్ని మన మెదడు విశ్లేషిస్తుంది. చాలా కాలంగా మనం తలవని వ్యక్తుల గురించి కూడా మనకు కలలు రావచ్చు. ఆ కల నిజమైన సంఘటన కాకపోవచ్చు కానీ, అది కలిగించిన భావోద్వేగాలు మాత్రం నిజమైనవి కావచ్చు.
తమ భాగస్వామి కన్న కల కారణంగా ఎవరైనా అసూయ, భయం లేదా అభద్రతా భావానికి లోనైతే ఆ భావనలను విస్మరించడానికి బదులుగా వాటి గురించి ప్రశాంతంగా చర్చించుకోవడం ఉత్తమం. కేవలం ఒక కల ఆధారంగా భాగస్వామి ఉద్దేశాలను అనుమానించడం లేదా ఆ కలను నమ్మకద్రోహానికి నిదర్శనంగా భావించడం సరైనది కాదు. ఒకవేళ సంబంధంలో అభద్రతా భావానికి కారణమయ్యే సమస్యలు ఇప్పటికే ఉంటే, అసలు సమస్యను పరిషరించుకోవడంపై దృష్టి పెట్టడం మరింత ముఖ్యం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

