హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో హైదరబాద్‌లో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రఫీ అవార్డు పోటీల్లో ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ చీఫ్ ఫొటో జర్నలిస్ట్ వీరగోని రజనీకాంత్గౌడ్ ప్రత్యేక బహుమతిని కైవసం చేసుకున్నారు. అత్యుత్తమ సృజనాత్మకత, ప్రొఫెషనల్ నైపుణ్యంతో ఆయన తీసిన ఛాయాచిత్రం గురువారం ఈ అవార్డుకు ఎంపికైంది.
ప్రతిష్టాత్మక సంస్థ నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంపై పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రజనీకాంత్గౌడ్ గతంలోనూ పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో అవార్డులు అందుకొని తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇటీవల కర్ణాటక మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఆయన మూడో బహుమతిని గెలుచుకోగా, ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతిని దకించుకున్నారు. తాజాగా ఎఫ్‌టీసీసీఐ వేదికగా మరో అవార్డు వరించడంతో ఆయన ప్రతిభకు మరోసారి తగిన గుర్తింపు లభించింది.