జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 24 : జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె టీం సెవెన్ యూత్ గణేశ్ మండపం మతసామరస్యానికి వేదికైంది. మండపం నిర్వాహకులు గురువారం గణపతి లడ్డూను వేలం వేయగా, ఓ ముస్లిం యువకుడు రూ.70 వేలకు పాట పాడి దక్కించుకున్నాడు.
గణేశ్నగర్కు చెందిన ప్రముఖ గాయకుడు ఎండీ అభి కుమారుడు మహ్మద్ ఇషాన్ బాల్యం నుంచే వినాయక చవితి నవరాత్రులను తన స్నేహితులతో కలిసి ఘనంగా నిర్వహిస్తుండేవాడు. ముస్లిం అయినప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గణేశ్ నవరాత్రుల సమయంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొనడమే గాకుండా ఉపవాస దీక్షను కూడా చేపడుతుండేవాడు. ఈ సారి కూడా మిత్రులతో కలిసి ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా వేలంలో లడ్డూను దక్కించుకున్నాడు.