పాట్నా: సీఎం హెలికాప్టర్ ల్యాండ్‌కు ముందు ఒక ఆవు అలజడి సృష్టించింది. హెలిప్యాడ్ ప్రాంతంలోకి అది వచ్చింది. (Cow strays onto helipad) దీంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. ఆ ఆవును తరిమే క్రమంలో దాని దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ సిబ్బంది పరుగులుపెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ సంఘటన జరిగింది. ‘సమృద్ధి యాత్ర’లో భాగంగా సీఎం నితీశ్ కుమార్ శనివారం బెగుసరాయ్‌లో పర్యటించారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్ హెలికాప్టర్ రాకముందు ఒక ఆవు కలకలం రేపింది. హెలిప్యాడ్ ప్రాంతంలోకి అది దూసుకొచ్చింది. దీంతో అక్కడున్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ ఆవును తరలిమేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా దాని దాడి నుంచి తప్పించుకునేందుకు కొందరు పోలీసులు పరుగెత్తారు.
చివరకు హెలిప్యాడ్ ప్రాంగణం నుంచి ఆ ఆవు బయటకు వెళ్లింది. సీఎం హెలికాప్టర్ రాక ముందే ఆవు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Bihar –
In #Begusarai, where CM Nitish Kumar’s helicopter is scheduled to land shortly, a bull strayed onto the site. Police personnel had to flee to save their lives. pic.twitter.com/93QzNIgIur— Siraj Noorani (@sirajnoorani) March 14, 2026
Also Read:
Wife Runs Away | భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. మరో వ్యక్తితో భార్య పరార్
Watch: బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్