లక్నో: కొత్తగా పెళ్లైన యువ జంట బస్సులో బస్టాండ్‌కు చేరుకున్నారు. మరో బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నారు. తనకు ఆకలిగా ఉన్నదని పకోడీలు తీసుకురావాలని భర్తకు భార్య చెప్పింది. అతడు కొని తెచ్చేసరికి మరో వ్యక్తితో ఆమె పారిపోయింది. దీంతో భార్య అదృశ్యంపై భర్త ఫిర్యాదు చేశాడు. (Wife Runs Away ) ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్‌జిమ్‌తో గత ఏడాది డిసెంబర్ 1న పెళ్లి జరిగింది. ఇటీవల హోలీ పండగ కోసం ఆమె తన పుట్టింటికి వెళ్లింది.
కాగా, భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రీతమ్ సింగ్ అత్తవారింటికి వెళ్లాడు. మార్చి 9న భార్య రిమ్‌జిమ్‌తో కలిసి బస్సులో ప్రయాణించాడు. మరో బస్సు మారేందుకు బిలారి బస్టాండ్ వద్ద వారు దిగారు. తమ ఊరు వెళ్లే బస్సు కోసం వేచి ఉన్నారు.
మరోవైపు తనకు ఆకలిగా ఉన్నదని, వేడివేడి పకోడీలు తీసుకురమ్మని భర్త ప్రీతమ్ సింగ్‌కు భార్య రిమ్జిమ్ చెప్పింది. దీంతో బస్టాండ్ చివరలో ఉన్న షాపు వద్దకు అతడు వెళ్లాడు. పకోడీలు కొని తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందాడు. ఆమె కోసం బస్టాండ్ అంతా వెతికాడు. అక్కడున్న వారిని ఆరా తీశాడు. ఒక వ్యక్తితో కలిసి భార్య వెళ్లినట్లు తెలుసుకున్నాడు
కాగా, ఆందోళన చెందిన ప్రీతమ్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. ఆమె గ్రామానికి చెందిన యువకుడితో కలిసి పారిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రిమ్జిమ్ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read:
woman kills mother-in-law | ప్రియుడితో పట్టుబడిన కోడలు.. అత్తను చంపి గుండెపోటుగా నమ్మించేందుకు యత్నం