లక్నో: అర్ధరాత్రి వేళ ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని ఆమె అత్త చూసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఆ వృద్ధురాలిని హత్య చేశారు. గుండెపోటుతో మరణించినట్లు కోడలు నమ్మించింది. (woman kills mother-in-law) అనుమానించిన మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 3న అర్ధరాత్రి వేళ భంకర్పూర్ బసేలా గ్రామంలోని ప్రియురాలి ఇంటికి ఆదిల్ చేరుకున్నాడు. ఆ వ్యక్తితో అభ్యంతరకరమైన స్థితిలో కోడలు ఉండటాన్ని ఆమె అత్త చూసింది. దీంతో వారిద్దరూ ఆందోళన చెందారు. దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
కాగా, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసింది. అత్తకు గుండెపోటు వచ్చినట్లు చెప్పింది. గుండెపోటుతో ఆమె మరణించినట్లు అందరినీ నమ్మించింది. ఈ నేపథ్యంలో వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు.
మరోవైపు కోడలు ప్రవర్తనపై మామకు అనుమానం కలిగింది. దీంతో భార్య ఆకస్మిక మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మెడ విరిగినట్లు నిర్ధారించారు.
దీంతో పోలీసులు కోడలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగి విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ, ఆమె ప్రియుడైన ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read: