Mirzapur The Movie | ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ ఫ్రాంచైజ్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur The Movie) నుంచి మేకర్స్ ఒక క్రేజీ మాస్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘దో నంబరీ’ (Do Numbari) పేరుతో వచ్చిన ఈ హై-వోల్టేజ్ సాంగ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
ఈ పాటను ప్రముఖ ర్యాపర్ దండా నియోలీవాలా (Parveen) ఆలపించడమే కాకుండా స్వయంగా సాహిత్యాన్ని అందించి, స్వరపరిచారు. ‘బందే నంబర్ 1 కే.. ధంధే దో నంబరీ’ అంటూ సాగే లిరిక్స్, ఊరమాస్ బీట్స్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026 న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. మరోవైపు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్ ది మూవీ’ ఆఫీషియల్ ట్రైలర్ ఈ నెల ఆగస్టు 11న విడుదల కానుంది.
ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, అమెజాన్ ఎంజిఎమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను అభినయ్ పండిట్ సినిమాటోగ్రఫీతో, మెహ్రాన్ ఎడిటింగ్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు.