ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ ఉన్మాది స్కూల్ టీచర్ సంధ్య(Sandhya Teacher)ను కత్తితో పొడిచి చంపిన ఘటన సోమవారం జరిగిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల టీచర్ సంధ్యను నిందితుడు సుమారు 27 సార్లు పొడిచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు 21 ఏళ్ల అమిత్ గతంలో ఆమె వద్ద పాఠాలు నేర్చుకున్నాడు. సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్ ఆవరణలో జరిగిన కత్తి దాడి ఘటనకు చెందిన సీసీటీవీ వీడియో కూడా వైరల్ అయ్యింది. మర్డర్ జరిగిన రెండు గంటల్లోనే నిందితుడు అమిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. అమిత్ తనను వేధిస్తున్నట్లు గతంలో టీచర్ సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల నుంచి ఆమె వేధింపులు అనుభవిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
సంధ్య ఊరికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమెతో నిందితుడికి పరిచయం ఏర్పడింది. అమిత్‌తో మాట్లాడడం ఇష్టం లేకున్నా.. అతను మాత్రం సంధ్య వెంటపడేవాడు. వేధింపులకు గురి చేశాడు. అయితే తాజా వేధింపుల గురించి పోలీసులకు చెబుతానని అమిత్‌ను సంధ్య బెదిరించినట్లు తెలిసింది. అటాక్ జరగడానికి కొన్ని రోజుల ముందే వేధించినట్లు నిందితుడిపై సంధ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఆ సమయంలో అమిత్ క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. కానీ ఆ ఫిర్యాదు అంశంలో అతను కక్ష కట్టినట్లు అర్థమవుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కక్ష్యతోనే అతను మర్డర్ చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు.
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు సంధ్య స్కూల్‌కు వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అమిత్ తన ముఖానికి తెల్లబట్ట కట్టుకుని వచ్చి సంధ్యను కలవాలని చెప్పాడు. స్కూల్ సిబ్బంది విజిటర్ గురించి సంధ్యకు చెప్పారు. ఆమె మెయిన్ గేట్ వైపు వెళ్లింది. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. స్కూల్ సిబ్బంది వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. సుమారు 20కిపైగా కత్తితో పొడిచినట్లు తెలిసింది. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఆమె శరీరానికి 27 కత్తి పోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ముఖం, మెడ, ఛాతి, కడుపులో ఆ కత్తిపోట్లు దిగాయి.
సెక్టార్ 58 పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఏ కారణం చేత మర్డర్ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Woman teacher stabbed to death in broad daylight at Faridabad school pic.twitter.com/r1FClMv2m2
— Raajeev Chopra (@Raajeev_Chopra) August 3, 2026