Siricilla farmer | సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్థానిక మహిళలు, రైతులు తమదైన శైలిలో స్పందిస్తూ.. రేవంత్ సర్కార్‌ను ఎద్దేవా చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక సిరిసిల్ల రైతు ఒకరు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో నిలబడితే ఓ 100 ఓట్లు పడ్తయి కావొచ్చు.. వాళ్ల కార్యకర్తలు వేస్తే వేస్తరు. ఆయన సీఎం అయితే ఏంటి.. ఎవరైతే ఏంటీ.. ఆయన మాటల వరకే.. సీఎంగా ఫెయిలైండని అన్నారు.
రేవంత్ రెడ్డిది మేకపోతు గాంభీర్యమే.. మేకపోతు కోసేదాకా మే.. మే.. అంటది.. కోసినంక చప్పుడు చెయ్యక పంటది.. ఉన్నన్ని రోజులు వాళ్లదే కదా.. అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్లది సాగుతది. ఎట్లాగు ఇంకో సంవత్సరం ఆగితే వీళ్ల పని అయిపోతది అంటూ చెప్పుకొచ్చాడు.
కేసీఆర్‌కు కాంగ్రెస్ వాళ్లు నరదిష్టి పెట్టారు.. అది తీయడానికి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్నాడని సిరిసిల్లకు చెందిన ఓ పెద్దాయన అన్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా ఇక్కడ గెలవడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి రోడ్ల మీద పడుకున్నా సిరిసిల్లలో కాంగ్రెస్ రాదు.. కేటీఆర్‌ను ఎవరూ ఓడించలేరు. కేటీఆర్ మాకెప్పుడూ అందుబాటులో ఉంటారు.. మాకు ఏది కావాలంటే అది చేస్తరు.. నీళ్లు కావాలన్నా కొరత లేదు.. కరెంట్‌కు ఏం కొరత లేదు. అప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండే.. ఇప్పుడు చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తే ఒట్టు.. అంటూ చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో నిల్చుంటే ఓ 100 ఓట్లు పడతాయి వాళ్ల కార్యకర్తలవి
నిజమైన రైతు రేవంత్ రెడ్డి మీటింగ్‌కే పోడు
– సిరిసిల్ల రైతు https://t.co/jfxBipVUrY pic.twitter.com/VjtLiF8A0L
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి రోడ్ల మీద పడుకున్నా సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించలేరు
కేసీఆర్‌కు కాంగ్రెస్ వాళ్లు నరదిష్టి పెట్టారు.. అది తీయడానికి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్నాడు
– సిరిసిల్ల ప్రజలు https://t.co/T4miOgmV8N pic.twitter.com/FnPA8sLpvS
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి