Cristiano Ronaldo | పోర్చుగల్‌కు నా అసవరం లేదా?.. అయితే వీడ్కోలు పలుకుతా..!
Cristiano Ronaldo : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలుతో ఇప్పుడు అందరి కళ్లు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మీదే ఉన్నాయి. కోట్లాది మంది అభిమానగణమున్న ఈ ఫార్వార్డ్ ప్లేయర్ మరికొన్ని రోజులు ఆటత అలరిస్తాడనుకుంటే వీడ్కోలు పలికేలా ఉన్నాడు.
Cristiano Ronaldo : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలుతో ఇప్పుడు అందరి కళ్లు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మీదే ఉన్నాయి. కోట్లాది మంది అభిమానగణమున్న ఈ ఫార్వార్డ్ ప్లేయర్ మరికొన్ని రోజులు ఆటత అలరిస్తాడనుకుంటే వీడ్కోలు పలికేలా ఉన్నాడు. ఈమధ్య భావోద్వేగానికి లోనైన రొనాల్డో స్వయంగా తన రిటైర్మెంట్ టైం వచ్చేసిందిని అన్నాడు. సొంతదేశం తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అతడు.. తనను బెంచ్ మీద కూర్చోబెట్టడంపై విచారం వ్యక్తం చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాగైతే తాను కూడా మెస్సీని అనుసరిస్తూ వీడ్కోలు పలుకుతానేమో అని పేర్కొన్నాడీ వెటరన్.
సాకర్ ప్రపంచంలో తన ఆటతో కోట్లాదిమందిని మంత్రముగ్దులను చేసిన క్రిస్టియానో రొనాల్డో కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. వరల్డ్‌కప్ అనంతరం నెయ్మర్, లియోనల్ మెస్సీలు వీడ్కోలు పలకగా.. తదుపరి వికెట్ రొనాల్డోనే అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడే స్వయంతో వీడ్కోలుపై స్పందించాడు. నార్వేతో మ్యాచ్‌లో బెంచ్ మీద కూర్చోబెట్టడంపై చిన్నబుచ్చుకున్న రొనాల్డో ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డాడు.
🚨🎙️BREAKING: Cristiano Ronaldo reportedly reacted emotionally after being benched, admitting he never expected this and is now considering international retirement;
“I won’t lie, being benched for Portugal hurt me deeply. I never imagined I would reach a point where I’d feel… pic.twitter.com/O273VKyGxw
— Juju bloke (@Jujubloke) September 28, 2026
‘పోర్చుగల్ మ్యాచ్‌లో బెంచ్‌పై కూర్చోబెట్టడం నన్ను చాలా బాధిస్తోంది. జట్టకోసం సర్వం ధారపోసిన నేను.. మేనేజ్మెంట్కు నాపై నమ్మకం లేని రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంతకుముందులా వారు నన్ను చూడడం లేదు. అయితే.. దేశం తరఫున నేను కలగన్న ప్రతిదీ సాధించాను. పోర్చుగల్ జట్టుకు నా అవసరం లేనప్పుడు.. నా అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని నేను అంగీకరిస్తున్నా. ఇలా బెంచ్ మీద ఉండడం కంటే వీడ్కోలు పలకడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది’ అని రొనాల్డో ఉద్వేగభరింతగా వెల్లడించాడు.
నార్వేతో మ్యాచ్‌లో రొనాల్డో 90 నిమిషాలు బెంచ్ మీదే ఉన్నాడు. అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూసి విసిగెత్తిపోయిన అతడు.. కోపంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో హొలాండ్ 57వ నిమిషంలో గోల్ చేసినా 1-2తో పోర్చుగల్ గెలుపొందింది.
It’s not looking good for Jorge Jesus, Cristiano Ronaldo is already planning a way to get him sacked for benching him 😭😭😭 pic.twitter.com/Tk9EOBAw2u
— 𝙷𝚊𝚛𝚛𝚒𝚜𝚘𝚗 (@fcbharrison) September 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

