Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తో అభిమానులను ఖుషీ చేశారు. ఇంతకాలం ‘ఏకే 64’గా పిలవబడిన ఈ చిత్రానికి ‘డేర్ డెవిల్’ (Dare Devil) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా, అజిత్ సతీమణి షాలిని అజిత్‌కుమార్ ‘బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2027 వేసవి కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
నటుడిగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అద్భుతమైన రేసర్‌గా రాణిస్తూ గత 20 నెలల్లో అనేక ట్రోఫీలను గెలుచుకున్న అజిత్ ఆఫ్-స్క్రీన్ పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఈ ‘డేర్ డెవిల్’ టైటిల్ సరిగ్గా సరిపోతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన డైస్ (Dice) డిజైన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా విడుదలైన 16 నెలల తర్వాత అజిత్ నుంచి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ షూటింగ్ సమయంలోనే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా వన్-లైనర్ను అజిత్‌కు వినిపించగా, ఆయన వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కావడంతో, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించనున్నారు. చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలను రానున్న వారంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇండస్ట్రీలో 34 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అజిత్ కెరీర్లో ఈ ‘డేర్ డెవిల్’ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పట్ల తనకు అవకాశం ఇచ్చిన అజిత్ కుమార్‌కు, నిర్మాత షాలిని మేడమ్‌కు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#DareDevil – #AjithKumar #ShaliniAjithkumar #BraveHeartsProduction @Adhikravi @anirudhofficial @SureshChandraa @AbinandhanR @editorvijay @supremesundar #Subbhunaarayan @itsanuvardhan @kayoas13 @valentino_suren @Donechannel1 @AbdulNassarOffl @AMBANINSK#AK64 pic.twitter.com/ccUoL0Zltg
— Suresh Chandra (@SureshChandraa) August 3, 2026