లక్నో: ఒక వ్యక్తి ఆర్డర్ చేసిన బిర్యానీలో కుక్క కాలు కనిపించింది. కుక్క పాదం మాదిరిగా ఉన్న మటన్ పీస్‌ను ఆ వ్యక్తి చూపించాడు. (Dog’s Leg In Biryani) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కామెంట్లు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే సగానికి పైగా తిన్న తర్వాత ఆ బిర్యానీలో కుక్క కాలు వంటిది కనిపించిందని అతడు తెలిపాడు. ఆ మాంసం ముక్కను జూమ్ చేసి చూపించాడు. ఈ పీస్ చికెన్ లేదా మటన్ కాకుండా కుక్క పాదం, కాలి వేళ్లను పోలి ఉన్నదని ఆరోపించాడు. మిగిలిన బిర్యానీని కవర్లో పడేశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆన్లైన్లో పెద్ద చర్చ జరుగడంతోపాటు కామెంట్లు వెల్లువెత్తాయి. అది ‘కుక్క బిర్యానీ’ అంటూ ఒకరు చమత్కరించారు. ఆ పీస్‌ను గుర్తించే ముందు ఆ వ్యక్తి సగం బిర్యానీ తిన్నట్లు మరొకరు గుర్తు చేశారు.
మరోవైపు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ తప్పులేదని కొందరు పేర్కొన్నారు. బిర్యానీ సప్లై చేసిన రెస్టారెంట్‌ను మరికొందరు నిందించారు. అయితే రోజు రోజుకు విస్తరిస్తున్న ఫుడ్ డెలివరీ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని చాలా మంది ప్రశ్నించారు.
Zomato Meat order turns
SHOCKING ‘DOG LEG’ CLAIM GOES VIRAL I KANPUR
pic.twitter.com/ilr4445miz— Ghar Ke Kalesh (@gharkekalesh) March 12, 2026
Also Read:
Wife Runs Away | భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. మరో వ్యక్తితో భార్య పరార్
Surat woman killed | పెద్ద కోడలు, చిన్న కొడుకు మధ్య సంబంధం.. వ్యతిరేకించిన తల్లిని హత్య
Mojtaba Khamenei | కోమాలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్!.. మొజ్తబా ఖమేనీ కాలు కోల్పోయారు: ది సన్