హైదరాబాద్ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా రేపు (మార్చి 19న) బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పూజా కార్యక్రమం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది.
వేదపండితులు పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం అందరికీ ఆశీర్వచనాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

Ugadi Fest