Wife kills husband and son | ప్రియుడి(Lover) మోజులో పడిన ఓ మహిళ పేగుబంధాన్ని కాదనకుంది. అగ్నిసాక్షిగా మనువాడిన భర్త అభినందన్(35), రక్తం పంచుకుపుట్టిన బిడ్డ యుదువీర్ (4) దిండుతో ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా హత్య(Wife kills husband and son )చేసింది. ఆపై నా భర్త, కుమారుడు ఊపిరాడక చనిపోయడని నమ్మించేందుకు ప్రయత్నించిన హరిణి ఆమె ప్రియుడు వినయ్(30)ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటక రాజధాని బెంగళూరులోని(Bengaluru) చిక్కబాణవారంలో హరిణి, ఆమె భర్త అభినందన్, ఐదేళ్ల కుమారుడు నివసిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంతో ఇన్స్టాగ్రామ్ పరిచయం వారి కాపురంలో చిచ్చుపెట్టింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వినయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా హరిణితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హరిణి భర్త అభినందన్‌కు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని లేదంటే విడాకులు తీసుకొని వెళ్లిపోవాలని హెచ్చరించాడు.
దీంతో తన భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తన స్నేహితుడి సహాయం కోరింది. ఇద్దరూ కలిసి పథకం రచించారు. ఆదివారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత అభినందన్అ, తని కుమారుడు నిద్రపోయారు. అదే సమయంలో హరిణి తన స్నేహితుడు వినయ్‌తో కలిసి వారిద్దరిని దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ప్రారంభంలో భర్తను మాత్రమే చంపాలని అనుకున్నారు. అయితే కుమారుడు నిద్రలేచి ఆ దాడిని గమనించడంతో ఎవరికైనా చెప్తారనే భయంతోబాలుడిని కూడా ఊపిరి ఆడకుండా చేసి చంపారు. అనంతరం ఏమీ తెలియనట్లు నటించిన హరిణి నిద్రలేచి చూసేసరికి తన భర్త, కుమారుడు స్పృహ లేకుండా పడి ఉన్నారని సోమవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం హరిణి వినయ్‌తో వెళ్లిపోయిందని అభినందను బంధువులు పోలీసులకు తెలపడంతో వారి అనుమానం బలపడింది. తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని జైలుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.