YTPS | యాదాద్రిలో రెండు యూనిట్లు బంద్.. నిలిచిపోయిన 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి
YTPS | దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద పవర్‌ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) సంక్షోభంలో పడింది. ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లు బంద్ అయ్యాయి.
YTPS | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద పవర్‌ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) సంక్షోభంలో పడింది. ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లు బంద్ అయ్యాయి. కొంతకాలం క్రితం వరకు యూనిట్-4 బంద్ కాగా, తాజాగా యూనిట్-3లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల చొప్పున మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
నడుస్తున్న నాలుగు యూనిట్లల్లో రెండు మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఉత్పత్తి నిలిచిపోయిన యూనిట్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్లాంట్‌లో బొగ్గు సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్‌లో కేవలం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయి. కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) నిబంధనల ప్రకారం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. సింగరేణి నుంచి, ఒడిశాలోని నైని నుంచి బొగ్గు సరఫరా అవుతున్నా.. అది ఏ మూలకూ సరిపోవడంలేదు. బొగ్గు నిల్వలు నిండుకుంటే.. మొత్తం ప్లాంట్ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బొగ్గు వచ్చేది 14 మిలియన్ టన్నులే
సింగరేణి సంస్థ నుంచి జెన్కోకు దీర్ఘకాలిక బొగ్గు లింకేజీ రూపంలో 28.872 మిలియన్ టన్నులు బొగ్గును కేటాయించారు. ఇందులో 14 మిలియన్ టన్నుల జీ-9 గ్రేడ్ బొగ్గును వైటీపీఎస్‌కు సరఫరా చేయాల్సి ఉన్నది. సీఈఈ నిబంధనల ప్రకారం ఈ ప్లాంట్‌కు 15.75 మిలియన్ టన్నుల జీ-9 గ్రేడ్ బొగ్గు అవసరం. కానీ, సింగరేణి జీ-13 గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నది. దీంతో ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు పరిమాణం 21.45 మిలియన్ టన్నులకు చేరింది. సింగరేణి సమకూరుస్తున్న 14 మిలియన్ టన్నుల బొగ్గు మూడు యూనిట్లకు కూడా సరిపోవడంలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు లింకేజీలో 76% బొగ్గును మాత్రమే సరఫరా చేసింది. నాణ్యత 40 శాతమే ఉన్నదని జెన్కో వర్గాలంటున్నాయి.
మహానదిపైనే ఆశలు
సంక్షోభం నేపథ్యంలో బొగ్గు కోసం సింగరేణిపై ఆధారపడరాదన్న భావనకు జెన్కో అధికారులొచ్చారు. బొగ్గు లభ్యత, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్)ను సంప్రదించారు. ఐదు మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయాలంటూ గత నెలలో జెన్కో అధికారులు మహానది కోల్ఫీల్డ్స్కు లేఖ రాశారు. అయితే, నిర్దేశించిన ధరకు తాత్కాలికంగా ఇవ్వలేమని.. ధరలు పెంచితే ఇస్తామని ఎంసీఎల్ మెలికపెట్టింది. కావాలంటే వేలంలో కొనుగోలు చేసుకోవాలని సూచించింది. సీఈఏ అనుమతి పొందితే.. శాశ్వత ప్రాతిపదికన బొగ్గు ఇస్తామని ఎంసీఎల్ వెల్లడించినట్టు సమాచారం.
పర్యవేక్షించిన సీఎండీ
తాజా పరిణామాల నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను జెన్కో సీఎండీ హరీశ్ సందర్శించారు. దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేశ్‌పాటిల్ సైతం సీఎండీ వెంట ఉన్నారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి వీర్లపాలెంలోని ప్లాంట్‌కు చేరుకున్న ఆయన ప్లాంట్‌లోని తాజా పరిస్థితులపై అధికారులను కలిసి ఆరా తీశారు. బొగ్గు నిల్వలు, ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం, ప్లాంట్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై అధికారులతో సమీక్షించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

