Erravelli Dalit Farmers | ఎర్రవల్లి దళిత రైతుల్లో టెన్షన్.. రైతుల సమక్షంలో హద్దుల నిర్ధారణ.. 4 బృందాలతో విచారణ
సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామ శివారులో ఉన్న 325 సర్వే నంబర్ భూముల్లో సోమవారం రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో మోకా సర్వే (ఎంజాయ్మెంట్) ప్రారంభించడంతో దళిత రైతుల్లో ఆందోళన నెలకొన్నది. గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, సిద్దిపేట జిల్లా సర్వే ఏడీ సుదర్శన్ రాథోడ్ నేతృత్వంలో నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే నిర్వహిస్తున్నా రు.
Erravelli Dalit Farmers | సిద్దిపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామ శివారులో ఉన్న 325 సర్వే నంబర్ భూముల్లో సోమవారం రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో మోకా సర్వే (ఎంజాయ్మెంట్) ప్రారంభించడంతో దళిత రైతుల్లో ఆందోళన నెలకొన్నది. గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, సిద్దిపేట జిల్లా సర్వే ఏడీ సుదర్శన్ రాథోడ్ నేతృత్వంలో నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే నిర్వహిస్తున్నా రు.
సర్వే రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ షమీనా బేగం సర్వే తీరును పరిశీలించారు. డీజీపీఎస్ ద్వారా భూహద్దులు నిర్ధారిస్తున్నారు. 325 సర్వే నంబర్లో 388.05 ఎకరాలు ఉన్నది. శనివారం వందమందికి సర్వే నోటీసులు ఇవ్వగా సోమవారం 60మందికి జారీ చేశారు. నోటీసులు అందుకున్న రైతులు పట్టా పాస్ బుకులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇతర ఆధారాలను తీసుకుని పొలాల వద్దకు వచ్చి అధికారులకు హద్దులు చూపిస్తున్నారు. ఆ వివరాలనే అధికారులు నమోదు చేస్తున్నారు.
కొలతల్లో తేడా వస్తే ఎలా?
ఎర్రవల్లి రైతుల్లో ఆందోళన నెలకొన్నది. తమ పేర్లపై పట్టా పాస్‌బుక్‌లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి మధ్య ఏమైనా తేడా ఉన్నదా? అధికారులు నిర్వహిస్తున్న మోకా సర్వేలో తమ భూమి ఎంతగా తేలనున్నది? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. 325 సర్వే నంబర్లో క్షేత్రస్థాయిలో మోకా సర్వే చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రైతుల వారీగా భూముల హద్దులను గుర్తించి.. అనంతరం పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సర్వే ఫలితం ఎలా ఉంటుందో తెలియక దళిత రైతులు కలవరపడుతున్నారు. మోకా సర్వేను తమ సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
మా గ్రామ హద్దులు తేల్చాలి
తమ గ్రామానికి సంబంధించిన హద్దులను అధికారికంగా చూపించాలని మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ రైతులు కోరుతున్నారు. సర్వే నంబర్ 325లో గతంలో కలిసిన తమ భూముల లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. సోమవారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ.. నక్షా ప్రకారం రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించాలని, తమ భూముల లెక్క తేల్చాలని కోరుతున్నారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు తమ గ్రామానికి సంబంధించిన 35, 38, 81,88, 100, 101వ సర్వే నంబర్లలో భూములను గుర్తించాలని, ఖాస్ర్తా పహాణి ప్రకారం సర్వే నంబర్ 325లో హద్దులను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ముందుగా అధికారులు సర్వే నంబర్ 325లో హద్దులను అధికారికంగా గుర్తించిన తరువాత రైతుల వారీగా సర్వే చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

