Gold Mine Collapses | పెను విషాదం.. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో బంగారు గని కూలి 30 మంది మృతి
Gold Mine Collapses | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది.
Gold Mine Collapses | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(Central African Republic) పశ్చిమ ప్రాంతంలోని అబ్బా (Abba) వద్ద మంగళవారం ఓ బంగారు గని కూలిపోవడంతో(Gold Mine Collapses) కనీసం 30 మంది గని కార్మికులు మృతి చెందగా ..మరికొందరు అందులో చిక్కుకుపోయారని అధికారులు, స్థానికులు తెలిపారు. గనిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మర చర్యలను చేపట్టాయి. అయితే వారు ప్రాణాలతో దొరికే అవకాశాలు చాలా తక్కువని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఫ్లోరియన్ గగుండే అనే కార్మికుడు తెలిపారు. సహాయక బృందాలు, స్థానికులతో కలిసి గంటల తరబడి శ్రమించి కూలిపోయిన గని నుండి 30 మృతదేహాలను వెలికితీశారని, గాయపడిన కార్మికులకు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.
బురదలో కూరుకుపోయిన యువతీ యువకుల మృతదేహాలతో ఆ ప్రదేశమంతా హృదయవిదారకంగా మారింది. సహాయం కోసం పలువురు కోసం కేకలు వేయడంతో ఆ ప్రాంతమంతా యుద్ధభూమిని తలపించింది. బాధితకుటుంబాలను ఆదుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, మధ్య ఆఫ్రికా గణ తంత్రంలో చిన్న తరహా గనుల తవ్వకంలో వేలాది మంది పనిచేస్తుంటారు. ఇక్కడ గనులు కూలిపోవడం సర్వసాధారణం. గని కార్మికులకు సాధారణంగా తగినంత రక్షణ ఉండకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

