UP Woman Kills Truck Driver | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP )పిలిభిత్ జిల్లాలో గత నెలలో జరిగిన ఒక ట్రక్ డ్రైవర్ హత్య(Truck Driver )కేసును పోలీసులు ఛేదించారు. తాము ఏకాంతంగా ఉన్నప్పటి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే కారణంతోనే ఓ మహిళ సదరు డ్రైవర్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపింది. ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు ట్రక్కుతో సహా తగులబెట్టింది. ఈ కేసుకు సంబంధించి 40 ఏళ్ల నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్ జిల్లాలోని బిలాస్‌పూర్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్ అనే మహిళ ట్రక్ డ్రైవర్ బల్విందర్ సింగ్‌ల మధ్య గత రెండు మూడేళ్లుగా సంబంధం ఉంది. అయితే, తన వైవాహిక జీవితం దెబ్బతింటుందనే భయంతో ఆమె ఈ బంధాన్ని ముగించుకోవాలని అనుకుంది.
కాగా, తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులకు చూపిస్తానని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బల్విందర్ ఆమెను బెదిరించినట్లు తెలిసింది. దీంతో బల్వీందర్‌ను ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకుంది. జూలై 10వ తేదీన ధన్నా బాబా గురుద్వారా సమీపంలోని ఒక కాలువ వద్ద ట్రక్కులోనే వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో అమన్‌దీప్ కౌర్ ఇనుప రాడ్డుతో బల్విందర్ తలపై బలంగా కొట్టి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత, బల్విందర్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించేందుకు ఆమె ట్రక్‌పై డీజిల్ పోసి నిప్పు పెట్టడంతో డెడ్‌బాడీ పూర్తిగా కాలిపోయింది. వివాహేతర సంబంధంలో ఏర్పడిన విభేదాలు , బ్లాక్‌మెయిలింగ్ కారణంగానే ఈ హత్య జరిగిందని ఎస్పీ సుకీర్తి మాధవ్ తెలిపారు. తెలిపారు. పిలిభిత్‌లోని గోమతి గురుద్వారా సమీపంలో నిందితురాలు అమన్‌దీప్ కౌర్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.