Kolkata: కోల్కతా హోటల్లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో మంగళవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 9 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా(Kolkata)లోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో మంగళవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 9 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 1.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకున్నది. అగ్నిమాపక సిబ్బంది తో పాటు పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పై అంతస్తులకు చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీ మెషిన్ బ్లాస్ట్ కావడం వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులంతా బంగ్లాదేశీ దేశస్థులు అని తెలిసింది. వైద్య చికిత్స కోసం వాళ్లు కోల్కతాకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

