Sampoornesh babu | ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ వివాదం.. జర్నలిస్ట్‌కు సంపూర్ణేష్ బాబు మద్దతు, నాగేంద్ర కుమార్ క్షమాపణలు
Sampoornesh babu | నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అడిగిన కొన్ని ప్రశ్నలు సంపూర్ణేష్ బాబును కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Sampoornesh babu | నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అడిగిన కొన్ని ప్రశ్నలు సంపూర్ణేష్ బాబును కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శరీరాకృతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబుపై నాగేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక నటుడికి అతని నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు మారుతాయా అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్ కావడంతో వివాదం మరింతగా పెరిగింది.
అయితే ఈ వ్యవహారంపై సంపూర్ణేష్ బాబు స్వయంగా స్పందించడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో నాగేంద్ర కుమార్ తనకు చాలా సన్నిహితమైన వ్యక్తి అని సంపూ తెలిపారు. ఆయనతో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని చెప్పారు. తనను అభిమానించే వారు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని సంపూర్ణేష్ బాబు కోరారు. ‘హృదయ కాలేయం’ సినిమా నుంచి తనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టుల్లో నాగేంద్ర కుమార్ కూడా ఒకరని, తనపై ఉన్న అభిమానంతోనే ఆయన అలా మాట్లాడి ఉంటారని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ వ్యాఖ్యలను తాను తప్పుగా భావించడం లేదని స్పష్టం చేశారు. నాగేంద్ర అన్న నాకు చాలా క్లోజ్. మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. ఏదో ఫ్లోలో ఒక మాట దొర్లింది. నన్ను ఇష్టపడే వారంతా దీన్ని తప్పుగా తీసుకోవద్దు” అంటూ సంపూర్ణేష్ బాబు తన వీడియోలో పేర్కొన్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ కూడా స్పందించారు. సంపూర్ణేష్ బాబుతో తనకు చాలా ఏళ్లుగా స్నేహం, ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. ఆ సాన్నిహిత్యం కారణంగానే ఇంటర్వ్యూను సాధారణంగా కాకుండా వినోదాత్మకంగా సాగించాలనే ఉద్దేశంతో సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబును కించపరచడం లేదా అవమానించడం తన ఉద్దేశం కాదని నాగేంద్ర కుమార్ స్పష్టం చేశారు. సంపూ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయనలోని మానవతా దృక్పథం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల సంపూర్ణేష్ బాబు అభిమానులు, ప్రేక్షకులు బాధపడి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.
జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అన్న గారి ఇంటర్వ్యూ ఇష్యూ పై నా క్లారిఫికేషన్ pic.twitter.com/dL0W5IrToq
— Sampoornesh Babu (@sampoornesh) September 25, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

