‘RC 17’లో రామ్‌చరణ్ క్యారెక్టర్ అదేనా?
‘ఆర్ఆర్ఆర్' సినిమా రామ్‌చరణ్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేస్తే.. ‘పుష్ప’ ఫ్రాంచైజీ సుకుమార్‌ని పాన్ ఇండియా డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్లో ‘RC 17’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా రామ్‌చరణ్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేస్తే.. ‘పుష్ప’ ఫ్రాంచైజీ సుకుమార్‌ని పాన్ ఇండియా డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్లో ‘RC 17’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
అయితే.. షూటింగ్‌కి మాత్రం నెలరోజులపైనే సమయం ఉంది. వచ్చే ఏడాది జనవరి చివరివారంలో గానీ, లేక ఫిబ్రవరి తొలివారంలో గానీ షూటింగ్ ప్రారంభించేందుకు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం రామ్‌చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను పక్కా సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇందులో రామ్‌చరణ్ పాత్రపై ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిగా ఇందులో రామ్‌చరణ్ కనిపిస్తారట. ప్రారంభం నుంచీ ఆ పాత్రను పాజిటివ్‌గా నడిపిస్తూ..
చివరకు హీరోనే అసలైన విలన్ అని ప్రేక్షకుల్ని నమ్మించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారట సుకుమార్. హీరోలోనే విలన్ దాగున్నాడనే నిజాన్ని ైక్లెమాక్స్‌లో రివీల్ చేసే తీరు గూజ్బంప్స్ తెప్పిస్తుందని ఇన్సైడ్ టాక్. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి. ప్రస్తుతం కథానాయికనీ, సంగీత దర్శకుడ్ని ఫైనల్ చేసేపనిలో సుకుమార్ బిజీగా ఉన్నారు. 2028 ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్, టీసిరీస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

