లక్నో: వంతెన నిర్మాణం పనులపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడువులోగా నిర్మాణం పూర్తికాకపోతే ఆ కాంట్రాక్టర్‌తో కలిసి వంతెన పైనుంచి దూకుతానని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Officer Threatens To Jump Off Bridge) ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 44లోని కైల్గువాన్ కూడలి వద్ద ఓవర్ బ్రిడ్జీని నిర్మిస్తున్నారు. అయితే మూడేళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు పక్క నుంచి మళ్లడంతో ప్రతిరోజూ హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కాగా, శుక్రవారం ఉదయం డివిజనల్ కమిషనర్ విమల్ కుమార్ దూబే తన సిబ్బందితో కలిసి ఆ వంతెన వద్దకు చేరుకున్నారు. పనులను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్‌ను కూడా పిలిపించారు. వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగారు.
అయితే ఆ పనుల పూర్తిపై కాంట్రాక్టర్ స్పష్టత ఇవ్వలేదు. దీంతో జనవరి 15 నాటికి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారి విమల్ కుమార్ దూబే ఆదేశించారు. జనవరి 15న తాను మళ్ళీ వచ్చి తనిఖీ చేస్తానని తెలిపారు. అప్పుడు వంతెన పని అసంపూర్తిగా కనిపిస్తే తాను కారు దిగి కాంట్రాక్టర్‌తో పాటు వంతెన పైనుంచి దూకుతానని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ఝాన్సీలోని గ్వాలియర్ రోడ్డులో కూడా ఇలాంటి ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నదని ఆ అధికారి తెలిపారు. డిసెంబర్ 30 నాటికి పని పూర్తి కావాలని ఆ కాంట్రాక్టర్‌కు అల్టిమేటం ఇచ్చినట్లు చెప్పారు. ఆ గడువు నాటికి పని పూర్తి కాకపోతే ఆ వంతెనపై నుంచి దూకుతానని బెదిరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ललितपुर : कमिश्नर झांसी मंडल विमल कुमार ने दी चेतावनी
➡ठेकेदार को साथ लेकर पुल से कूदने की चेतावनी
➡ओवर ब्रिज का निर्माण पूरा नहीं होने पर नाराज
➡ओवर ब्रिज निर्माण पूरा करने का दिया अल्टीमेटम
➡15 जनवरी तक निर्माण नहीं होने पर दी चेतावनी
➡ठेकदार को साथ लेकर ओवरब्रिज से कूदने… pic.twitter.com/5SOqGCDpTv— भारत समाचार | Bharat Samachar (@bstvlive) December 26, 2025
Also Read:
Watch: చనిపోయిన తర్వాత కూడా.. టీచర్ తలపై కాల్చుతూనే ఉన్న దుండగులు