Kuldeep Yadav : భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) పెళ్లి సందడి మొదలైంది. ముస్సోరిలోని హిల్ స్టేషన్లో కుల్దీప్ – వన్షికా సింగ్ (Vanshika Singh) ముందస్తు పెళ్లి వేడుక సంబురంగా జరిగింది. కాబోయే భార్యతో కలిసి కుల్దీప్ కొత్త దుసుల్లో మెరిసిపోయాడు. స్థానిక హోటల్లో శనివారం హల్దీ కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఈ వేడకలో టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తెగ సందడి చేశాడు. కుల్దీప్ ముఖానికి పసుపు రాసిన చాహల్.. డోలు బాజాల దరువుకు కాబోయే పెళ్లికొడుకుతో కలిసి స్టెప్పులు వేశాడు.
పొట్టి ప్రపంచకప్ కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న కుల్దీప్ యాదవ్.. మరొకొన్ని గంటల్లో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ప్రేయసి వన్షికా సింగ్తో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిశ్చితార్ధం జరిగింది. అనంతరం ముస్సోరిలోని ప్రముఖ హోట్ల్లో శనివారం వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా మొదలైంది. హల్దీ వేడుకతో పెళ్లి సంబురాలు షురూ అయ్యాయి.
భారత క్రికెటర్లు రింకూ సింగ్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్ కాబోయే వరుడు కుల్దీప్తో కలిసి హంగామా చేశారు. సాయంత్రం 6 గంటలకు కాక్టైల్ పార్టీ జరుగనుంది. మరికొంతమంది క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కుల్దీప్ – పెళ్లికి హాజరు కానున్నారు. డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి ఇప్పటికే సెలబ్రిటీల తాకిడి మొదలైంది. మార్చి 17వ తేదీన లక్నోలోని హోటల్ సెంట్రమ్లో కుల్దీప్ రిసెప్షన్ ఉండనుంది.