కటక్: ఒడిశాలోని కటక్‌లో గల ఎస్సీబీ వైద్య కళాశాల దవాఖానలో సోమవారం మంటలు చెలరేగి 10 మంది మరణించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మంటలు వ్యాపించి మరో ఐదుగురు రోగులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తూ 11 మంది దవాఖాన సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. క్షతగాత్రులను అదే క్యాంపస్‌లోని కొత్త వైద్య భవనానికి మార్చి చికిత్స అందచేస్తున్నారు.